ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతుంటే.. ఉగ్రవాదులనే దొంగ* కొడుకులు సమయం చూసి దెబ్బ కొడుతున్నారు. కాబూల్ లోని సిక్కుల ప్రార్థనా మందిరమైన గురుద్వారాపై దాడికి దిగారు. ఇక్కడ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన దాడిలో

మొత్తం 28 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్ర దాడిలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

 

 

కాబూల్‌లోని షోర్ బజార్‌లో ఉన్న గురుద్వారాలో సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయలో ఈ దాడి జరిగింది. దాడి సమయంలో గురుద్వారాలో 150 మంది సిక్కులు ప్రార్థనలు చేస్తున్నారు. సాయుధులైన కొందరు ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడి కక్కడే 15 మంది మృతి చెందారు. గాయపడిన కొందరిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

 

ఆసుపత్రులకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ మరికొందరు ప్రాణాలు విడిచారు. దాంతో ఈ ఉగ్రదాడిలో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 28కి చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. కాల్పుల విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక టెర్రరిస్టు చనిపోయాడు.

 

 

కాల్పులు జరిపింది తామేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతున్న సమయలో ఇలాంటి దాడులు క్రూరమని భారత్ మండిపడింది. ఆప్గాన్‌లో హిందువులు, సిక్కుల ర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన సాయాన్ని అందించేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని భారత్ ప్రక‌టించింది. గ‌తంలో కూడా ఆప్గనిస్థాన్‌లో సిక్కుల‌పై దాడి సంఘ‌ట‌న‌లో 19మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: