ఇంట్లో దొంగ ను ఈశ్వరుడైన పట్టలేడు అనే సాయతకు సరిగ్గా ఇక్కడ ఓ సంఘట న చోటు చేసుకుంది. దేశ వ్యాప్తం గా కొన సాగుతున్న కరోనా ప్రభావం ప్రజల ను వణికిస్తున్న సంగతి తెలిసిందే.. అందుకే ప్రభుత్వం ప్రజలను ఇంటి నుంచి బయట కు రావొద్దని లాక్ డౌన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రజలు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వీయ నిర్బంధం లో ఉన్నారు. 

 

 


కాగా, పోలీసులు, వైద్యులు, మీడియా మాత్రం బయట తిరుగు తున్నారు. అదీ ఓ మహిళా జర్నలిస్టు ని కావడం గమనార్హం. ట్విటర్ ద్వారా ఆమె విషయాన్ని వెల్లడించడం తో స్పందించిన పోలీసులు.. తక్షణ చర్యలు చేపట్టారు. ఆమెను సంప్రదించి వివరాలు సేకరించడంతో పాటు ఆమె ఇంటికెళ్లి మరీ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న ఘటన మహారాష్ట్ర లో జరిగింది.

 

 


ఈ ఘటన ముంబై సమీపంలోని కండివ్లి పరిధి ఠాకూర్ గ్రామం లో చోటు చేసుకుంది. తన తండ్రి కి మందులు ఇచ్చి రాత్రి వేళ తిరిగి వస్తున్న ఓ లేడీ మీడియా ప్రతినిధిని పెట్రోలింగ్ సిబ్బంది నిలువరించారు. ఆమెను తనిఖీలు చేస్తారని ఆమె భావించినప్పటికీ.. అవేవీ చేయకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు పోలీసు సిబ్బంది. తానూ మీడియా ప్రతినిధిని అని ఎన్నిసార్లు వాదించిన కూడా ఎవరు ఆమె మాటను పట్టించుకోలేదు. 

 

 

 

ఎక్కడికి వెళ్తున్నావ్ చిలక అంటూ డబుల్ మీనింగ్ తో మాట్లాడాడు. అనంతరం ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత ఓ ప్రాంతానికి చెందిన పెట్రోలింగ్ పోలీసులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని ట్విట్టర్ లో పేర్కొంది వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఆమె ఇంటివద్దకు వెళ్లి మరీ స్టేట్మెంట్ తీసుకున్నార..  అంతేకాకుండా ఆ సమయంలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: