అవునా? అంత పని ఎం చేసింది? షాక్ అయ్యేంత పని ఎం చేసిందో అని అనుకుంటున్నారు కదా!? అక్కడే ఉంది అసలు కథ. ఆ ఊరి సర్పంచ్ తెలంగాణలోనే అతిపిన్న వయస్కురాలైన సర్పంచ్‌గా రికార్డులకెక్కింది. అలా రికార్డుకెక్కాడమే కాదు అప్పుడప్పుడు మీడియాలో కూడా ఎక్కుతూంటుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా వార్తల్లోకి ఎక్కి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ ను అంతం చెయ్యాలి.. వ్యాపించకూడదు అని రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఎందరో ప్రజలు ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వచ్చి దెబ్బలు తింటున్నారు. 

 

ఇంకా ఈ తరహాలోనే ఓ గ్రామా సర్పంచ్ చేసిన పని చూసి అందరూ షాక్ అవుతున్నారు.. ఆమె ఫోటోను నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాక్‌డౌన్‌లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ప్రజాప్రతినిధి భాగస్వామి కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామ సర్పంచ్ ఉడుత అఖిల యాదవ్ రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి గ్రామంలోకి ఎవరూ రాకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా కాపు కాశారు. ముఖానికి అడ్డుగా వస్త్రం కట్టుకుని.. కర్ర చేతపట్టుకొని నిల్చున్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఒక్క ఈమె కాదు తెలంగాణాలో ఏ గ్రామానికి వెళ్లిన ఈ పరిస్థితే కనిపిస్తుంది. ఇంకా నగరాల్లో అయితే బయటకు ప్రజలు అనవసరంగా వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసులు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. జైల్లో వేసి అరెస్ట్ చేసి పడేస్తున్నారు. ఇంటికి కాదు కదా ఆ మహానగరం నుండి బయటకు రాకుండా.. లోపలికి పోకుండా చేసి పడేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: