దేశంలో కరోనా మహమ్మారిని తిప్పి కొట్టేందుకు ఓ వైపు కేంద్రం మరోవైపు రాష్ట్రాలు తీవ్ర కృషి చేస్తున్నాయి.  ఈ నేపథ్యంతో తెలుగు రాష్ట్రాల సీఎం లు ఎప్పటికప్పుుడు కరోనా వైరస్ పై పర్యవేక్షిస్తున్నారు. అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని ఎం చేయాలో అన్న విషయం పై చర్చలు జరుపుతున్నారు. ఏపి సిఎం జగన్‌ కరోనా వైరస్ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ... హై లెవల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఏపి ప్రభుత్వం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే  కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

 

 

ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కరోనా నిరోధక బృందంతో జగన్ సమీక్ష నిర్వహించారు.  కరోనాని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు అష్ట దిగ్భందం చేస్తుందని.. ఇందుకు ప్రతి పౌరుడు కూడా సహకరిస్తున్నారని అన్నారు.  అత్యవసర పనులైతే తప్ప బయటకు రావాలని.. లేదా ఇంటిపట్టునే ఉండాలని అంటున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ నిరోధక ద్రావణాలతో శుభ్ర పరచాలని ఆదేశించారు.

 

 

రేపటికల్లా ఇంటింటి సర్వేను పూర్తి చేయాలని, ఇందుకోసం గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశ వర్కర్ల సాయం తీసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి ఐసోలేషన్‌లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.  సాధ్యమైనంత వరకు ఏపిలో కరోనాని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు.  ఎవరై లాక్ డౌన్ ని ఉల్లంఘిచరాదని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: