కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు ఆయా దేశాలు అనుసరిస్తున్నాయి. చాలా వరకు అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇంకా ఎవరు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావడంతో కొన్ని ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగస్తులకు ముందే జీతాలు విచ్చేశారు. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తమ ఉద్యోగస్తులను వర్క్ ఫ్రం హోం పేరుతో ఆరునెలల జీతం బోనస్ గా ఇవ్వడం జరిగింది. తాజాగా ఇండియాలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీ లో పనిచేసే ఉద్యోగస్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. నెల జీతం 30 వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు నెలలో రెండు సార్లు జీతం ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్‌స్ట్రీస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.

 

 

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వారికి డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులకు కూడా లాక్ డౌన్ సమయంలో జీతాలు చెల్లించేందుకు నిర్ణయించింది. కీలకమైన ఉద్యోగులు తప్ప మిగతా వారంతా వర్క్ ఫ్రం హోం చేయాలని...రిలయన్స్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేసింది.

 

 

దీంతో రిలయన్స్ మాదిరిగా దేశంలో ఉన్న మిగతా ప్రముఖ కంపెనీలు కూడా తమ ఉద్యోగస్తులకు జీతాలు ముందే చెల్లిస్తే దేశం మొత్తం సంతోషంగా ఉంటుందని...రిలయన్స్ సంస్థ మాదిరిగా అందరూ ఆలోచించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు అనుకోకుండా ఒక్కసారిగా పరిస్థితులవల్ల లాక్ డౌన్ ఏర్పడింది ఇటువంటి సమయంలో కంపెనీలలో ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులకు యాజమాన్యం అండగా నిలబడాలని అప్పుడు వాళ్ళ జీవితాలు కూలిపోకుండా ఉంటాయని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: