ఒళ్లుకాలి ఒకడేడుస్తుంటే ఒంటికి సెంటు కొట్టుకోలేదని మరొకడు అడిగాడట.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన ఇలాగే ఉంటుంది.. ఇకపోతే చిన్నప్పటి నుండి పిల్లలకు ఏది కూడా అతిగా అలవాటు చేయకూడదు. అలా అలవాటు చేయడం వల్ల ఏది మంచి, ఏది చెడో తెలియని వారు చాలా ఇబ్బందుల్ని పెడతారు.. ఇక ప్రస్తుతం కరోనా వల్ల అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏదిపడితే అది మార్కెట్లో దొరకడం లేదు.. అంతే కాకుండా పెద్దల దగ్గరి నుండి పిల్లల వరకు స్వేచ్చగా ఉన్న వారు ఇప్పుడు పంజరంలోని పక్షుల్లా మారిపోయారు.. ఇప్పుడు మనిషి జీవితం ఎలా ఉందంటే.. పక్షులు జంతువులు ఇంత కాలం మానవులకు బయపడి తమ స్వేచ్చను కోల్పోగా, ఇప్పుడు మనుషులు కరోనాకు భయపడి పంజరాల్లోకి వెళ్లిపోయారు.. ఇక పక్షులు మాత్రం స్వేచ్చగా విహరిస్తున్నాయి..

 

 

ఇదిలా ఉండగా ఒక పాపకు బయటి ఫుడ్ద్ విపరీతంగా అలవాటు చేయడం వల్ల ఆ తల్లికి కలిగిన ఇబ్బంది అంతా ఇంతా కాదు.. అంతే కాకుండా ఆ పాప చేసిన తమాష కూడా చూస్తే ఒకవైపు నవ్వు వస్తుంది.. మరో వైపు పిల్లలను ఇలా పెంచడం ఏంటని చివాట్లు పెట్టాలనిపిస్తుంది.. ఆ వివరం తెలుసుకుంటే.. లండన్‌కు చెందిన జొయాన్‌ తన నాలుగేళ్ల కూతురు లయల చైనీస్‌ ఫుడ్‌ కావాలంటూ ఏడుస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

 

 

కాగా లాక్‌డౌన్‌ కారణంగా నాన్‌డోస్‌, కెఎఫ్‌సి, మెక్‌డోనాల్డ్‌ వంటి రెస్టారెంట్లు మూసేశారని, అందువల్ల ఇంట్లోనే వంట చేయవలసి వస్తుందని ఆ పాపకు తల్లి చెబుతుంది. దీంతో బోరును విలపించిన లయల.. కనీసం చైనీస్‌ ఫుడ్‌ కూడా దొరకదా అని కన్నీటి ధారతోనే తల్లిని అడిగింది. దీంతో చైనీస్‌ ఫుడ్‌ కూడా దొరకదని బదులిచ్చింది. మరి ఫుడ్‌ డెలీవరి కూడా లేదా అని అమాయకంగా తన తల్లిన ప్రశ్నించింది. దీంతో ఫుడ్‌ డెలీవరి కూడా లేదని తెలిపింది. ఇక ఇంకా బిగ్గరగా ఏడుస్తున్న లయలను ఓదార్చడం తల్లికి కూడా సాధ్యపడలేదు. ప్రస్తుతం ఈ వీడియో పిల్లల అలవాట్లకు అద్దం పడుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: