సంక్షోభంలో నుండే అవకాశాలు వెతుక్కోవాలి.. చంద్రబాబు తరచూ చెప్పే డైలాగ్

నిత్యావసరాలు ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి... తాజాగా చంద్రబాబు డిమాండ్

 

చంద్రబాబునాయుడు తరచూ వినిపించే నినాదానికి చేస్తున్న పనికి ఏమాత్రం పొంతన కనబడటం లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కొరోనా వైరస్ తో వణికిపోతోంది. ఇందులో భాగంగానే మొత్తం దేశమంతా లాక్ డౌన్ అయిపోయింది. సరే దేశమంతా లాక్ డౌన్ అయిపోయిందంటే కొందరు వ్యాపారస్తులకు  పండగే కదా. ఇపుడు చంద్రబాబు ఆధ్వర్యంలోనే నడుస్తున్న హెరిటేజ్ కంపెనీ యాజమాన్యం కూడా పండగ చేసుకుంటోంది.

 

హెరిటేజ్ ఫుడ్స్ కు పండగ ఏలాగంటే మొన్నటి వరకున్న హెరిటేజ్-ఫుల్ రిచ్ క్రీమ్ మిల్క్ 500 ఎంఎల్ ధర ను 28 రూపాయల నుండి 30 రూపాయలకు పెంచేసింది. దేశమంతా షట్ డౌన్ లోకి వెళ్ళిపోతే నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని జనాలంతా గోల పెట్టేస్తున్నారు. నిత్యావసరాల ధరలను పెంచేసే వాళ్ళపై చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నుండి అందరు ముఖ్యమంత్రుల వరకూ తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసియార్, జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి హెచ్చరికలనే చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

రెండో రోజుల క్రితం జగన్ కు చంద్రబాబు ఓ లేఖ రాశారు. అందులో నిత్యావసరాల ధరలు పెరగకుండా చూడాలంటూ డిమాండ్ కూడా చేశారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాగానే ఉంది మరి హెరిటేజ్ కంపెనీ అమ్మే పాల ధర మాత్రం రెండు రూపాయలు ఎందుకు పెంచినట్లు ? కొంపదీసి హెరిటేజ్ కంపెనీ తమది కాదని అంటారేమో. తమది కాకపోయినా ఆ కంపెనీలో మైనర్ వాటాదారుడే కదా ? లాక్ డౌన్ నేపధ్యంలో తమ ఉత్పత్తుల ధరలు తగ్గించాల్సింది పోయి పెంచటమేంటి ?  సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుక్కోవటం అంటే అర్ధం ఇదేనేమో ? మొత్తానికి చంద్రబాబు మాటలకు చేతలకు పొంతనే ఉండదని మరోసారి రుజువైంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: