లాక్ డౌన్‌తో ఇల్లు కదిలే అవకాశం లేదు. ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మన బిజీ లైఫ్‌లో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ మాయలో పడి పుస్తకపఠనం పక్కకు పెట్టేశాం. ఇప్పుడు దానికి సమయం చాలినంత ఉంది. అందుకే ఈ 20 రోజులు మంచి పుస్తకాలు చదివి మీ జీవితాన్ని మార్చుకోండి.

 

 

అసలు పుస్తకం చదవడం వల్ల కలిగే ఆనందానికి అలవాటుపడితే దాని ముందు, ఈ టీవీలు, సెల్ ఫోన్ లు ఏమాత్రం పని చేయవు. రొటీన్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ కాదు.. పర్సనాలిటీ డెవలప్ మెంట్ పై అనేక మంచి పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదివితే మీరు జీవితాన్ని చూసే దృక్పథం మారిపోతుంది. అలాంటి కొన్ని పుస్తకాలను ప్రస్తావిస్తాను.

 

 

రిచ్ డాడ్ పూర్ డాడ్.. ఈ పుస్తకం మనకు డబ్బు పై ఉన్న అపోహలను తొలగిస్తుంది. డబ్బు సంపాదించడం ఎంత సులభమో చెబుతుంది. డేల్ కార్నగీ రాసిన హౌటు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లూయన్స్ పీపుల్.. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలో చెబుతుంది. మరో పుస్తకం సీక్రెట్.. ఇది మీలో నిబిడీకృతమైన శక్తిని ఎలా వెలికి తీయాలో చెబుతుంది. మరో అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకం 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్.

 

 

వీటితో పాటు శివ్ ఖేరా రాసిన యు కెన్ విన్, ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్, థింక్ అండ్ రిచ్ గ్రో, హౌటు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ , ద ఆల్కెమిస్ట్, ద మాంక్ హు సోల్డ్ ఫెరారి వంటి వంటి పుస్తకాలు మీ జీవిత గమనాన్ని మార్చేస్తాయి. ప్రయత్నించి చూడండి. ఆ ప్రయత్నం మీకు చాలా ఆహ్లాదాన్ని, మానసికోత్తేజాన్ని ఇస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: