కరోనాపై పోరాటం కోసం కొందరు నేతలు ప్రభుత్వానికి సాయం గా నిలుస్తున్నారు. తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. సెలబ్రెటీలు, సినీ నటులు, ప్రజాప్రతినిధులు ఇలా తమ వంతుగా సాయానికి ముందుకొస్తున్నారు. వైసీపీ నేతల విషయానికి వస్తే.. వైసీపీ ఎంపీలు అంతా తమ రెండు నెలల జీతాన్ని కరోనాపై పోరాటం కోసం విరాళంగా ప్రకటించారు. ఒక నెల జీతం కేంద్రానికి మరో నెల జీతం రాష్ట్రానికి ప్రకటించేశారు.

 

 

మరో వైసీపీ ఎంపీ బాలశౌరి మరో అడుగు ముందుకు వేశారు. తన ఎంపీ నిధుల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 4 కోట్లు కేటాయిస్తున్నట్టు వైసీపీ ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్ చేస్తున్న కృషిపై ఆయన ప్రశంసలు కురిపించారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా వైరస్ కట్టడికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

 

 

కరోనా వైరస్‌ నివారణ కోసం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహాయ నిధికి విరాళం ఇస్తున్నానని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వానికి మద్దతుగా చేపట్టిన చర్య కాదని, ప్రజల్ని రక్షించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామిని కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

 

 

అయితే ఈ మాత్రం విరాళాలు సరిపోవు. ఇలాంటి కష్టకాలంలో ప్రజాప్రతినిధులంతా ముందుకు రావాలి. మరింతగా ఆదుకోవాలి. జనం ముందు వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని ప్రజలకు అండగా నిలవాలి. అప్పుడే వారు నిజమైన ప్రజాప్రతినిధులు అనిపించుకుంటారు. ఇదే మాట వైసీపీ ఎంపీ బాలశౌరి కూడా చెప్పారు. తన సహచర ఎంపీలు కూడా తమ ఎంపీలాడ్స్ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కరోనా నియంత్రణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తే రాష్ట్ర ఖజానాపై కొంత భారం తగ్గుతుందన్నారు బాలశౌరి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: