ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది ఈ విషయం తెలిసిందే.. అయితే ఈ రోజు వరకు ప్రపంచ వ్యాప్తంగా 4 .34 లక్షల మంది ఈ వైరస్ భారిన పడ్డారు. అలాగే కూడా మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 20 వేల దరిదాపులోకి వచ్చాయి. అయితే.. అమెరికాకరోనా వైరస్ ను ఎవరైనా కావాలని మరొకరికి అంటిస్తే వారి మీద ఉగ్రవాద చట్టం కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించి హెచ్చరించింది. అమెరికా న్యాయ శాఖ ఉన్నత అధికారులు పొలిసు శాఖ, అమెరికా అటార్నీలకు డిప్యూటీ అటార్నీ జనరల్ జఫ్రీ రోజెన్ ఇచ్చిన మెమోలో కరోనా వైరస్ ను ఇరుగు పొరుగు వారికి అంటిస్తే టెర్రరిస్ట్ నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

అయితే.. ఈ మేరకు ప్రాసిక్యూటర్లు, విచారణ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా., అమెరికరోమి న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాపించింది. ఇంకో రెండు మూడు రోజులలో పరిస్థితి చేజారిపోయే ప్రమాదముందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అక్క లాక్ డౌన్ కూడా ప్రకటించారు. అయినా పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రావటం లేదు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడిది ఓక రకంగా టెర్రరిజాన్ని పోలి ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు కావాలని కేసులు ఎవరైనా అంటించారా లేక ఇంకా ఏంటనే విషయం తెలియరాలేదన్నారు.

 

అందుకే ముందస్తు కార్యాల్లో భాగంగా ఇప్పుడు ఇలాంటి చర్యలను తీసుకోవలసి వస్తుందని ప్రకటించారు. కరోనా వైరస్ ను అంటిస్తామని బెదిరించినా లేక అంటించటం చేసినా వారిని వదిలిపెట్టేది లేదని ఆ మెమోలో తెలిపారు. కరోనాను అదుపు చేయటానికి ధరలను నియంత్రించేందుకు, అత్యవసర సరుకులు సరఫరా చేసేందుకు న్యాయశాఖ ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మాస్క్ లను ఎవరైనా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: