ఎవరికీ కనిపించకుండా సామాన్య ప్రజలనైనా, సమాజంలో పవర్ ఉన్న వారినైనా గడగడ లాడించే వారు సైబర్ నేరగాళ్లు. వారి కంటిలో పడ్డామంటే మన జీవితాల్ని సర్వనాశనం చేస్తారు. వ్యక్తిగత కక్షల కారణంగానో లేకపోతే ఇంకేదైనా కారణంగానో వీళ్ళు ప్రజలను తీవ్రంగా వేధిస్తుంటారు. అయితే తాజాగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భార్యనే టార్గెట్ చేశారు.




వివరాలు తెలుసుకుంటే... హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భార్య పై కొంతమంది సైబర్ నేరగాళ్లు దారుణంగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు గత కొన్ని రోజులుగా ఆమె పేరిట ఓ ఫేక్ ఇంస్టాగ్రామ్ ఖాతాని తెరిచి... చాలా అసభ్యకరమైన మెసేజ్లను ఇతరులకు పంపించడం ప్రారంభించారు. అయితే ఆ ఫేక్ ఐడి నిజమోనేనని భావించి మాజీ ఎమ్మెల్యే భార్య స్నేహితులు ఆ అకౌంట్ ని ఫాలో అయ్యారు. ఐతే ఆ అకౌంట్ నుండి వారికి బూతు మెసేజ్లు రాగా.. ఏ విషయం సదరు భార్యకు తెలియజేశారు స్నేహితులు. దాంతో ఒక్కసారిగా నిర్గాంతపోయిన ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. తర్వాత తన పేరుతో ఇలా ఒక ఫేక్ ఇంస్టాగ్రామ్ ఐడి ని క్రియేట్ చేసి తన పరువు మొత్తం గంగలో కలుపుతున్నారని ఆమె సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

 



ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సైబర్ నేర గాళ్ల కోసం వెతుకుతున్నారు. అయితే పోలీసు విచారణలో సైబర్ నేరగాళ్లు ఆమె ఫేక్ అకౌంట్ ద్వారా కొంతమంది ని ట్రాప్ చేశారని కూడా తెలిసింది. ప్రస్తుతానికి ఈ పని తెలిసినవారే చేయించి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో పలుకుబడి ఉన్న ఓ వివాహిత పరువును మంటగలిపిన ఈ సైబర్ నేరగాళ్లను బంజారా హిల్స్ పోలీసులు త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: