హైదరాబాద్ అనగానే వేలాది మంది విద్యార్ధులు చదువుకోవడానికి వెళ్తారు. లక్షల మంది ఉద్యోగులు అక్కడ ఉద్యోగాలు చేయడానికి వెళ్తూ ఉంటారు. వేలాది మంది పొట్ట కూటి కోసం హైదరాబాద్ బాట పడుతూ ఉంటారు. వేలాది మంది కోర్సులు అంటూ వెళ్తూ అంటారు. ఉప్పల్ నుంచి లింగం పల్లి వరకు ఎందరో అక్కడ హాస్టల్స్ లో ఉంటారు. వేలాది మంది హాస్టల్స్ లో ఉంటూ తమ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు దేశం మొత్తం లాక్ డౌన్ అయింది. 

 

దీనితో వేలాది మందికి తినడానికి తిండి దొరకడం లేదు. హాస్టల్ యజమానులు అందరూ కూడా సరుకులు దొరకక ఇప్పుడు చాలా మంది హాస్టల్ యజమానులు హాస్టల్ లో ఉన్న వాళ్లకి చెప్పేస్తున్నారు. పోనీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ప్రజా రవాణా మాత్రం దొరకడం లేదు. దీనితో వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్ళాలి అంటే చాలు ఇప్పుడు పోలీసులు తాట తీస్తున్నారు. దీనితో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణా ప్రభుత్వం రంగంలోకి దిగింది. 

 

వాళ్ళు అందరిని సొంత ఊళ్లు పంపడం లేదా అక్కడ ఉంచడం లేదా అనే దాని మీద ఆలోచిస్తున్నారు. అయితే చాలా మందికి వాహనాలు లేవు. వాహనాలు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అని అధికారులు చెప్తున్నారు. వాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుంది అంటున్నారు. వాళ్లకు కాగితం ఇచ్చి అప్పుడే అనుమతి ఇస్తారని ఎక్కడ ఆపినా సరే ఇబ్బంది ఉండకుండా చూస్తారని అంటున్నారు. వాహనాలు లేని వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మరి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో అర్ధం కాని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: