కరోనా వైరస్ కారణంగా ఎంతమంది మరణిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను మనిషిని పూడ్చడానికి కూడా స్థలం లేని విధంగా ఈ కరోనా వైరస్ చేసింది. దేశాలను శ్మశాన వాటికల తయారు చేస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మన భారత్ లో 11 మంది మృతి చెందగా 550 మందికిపైగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అయితే 19 వేలమందికిపైగా ఈ వైరస్ కు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ బారిన 4 లక్షలమందికిపైగా పడ్డారు. 

 

దీంతో భారత్ లో లాక్ డౌన్ ప్రకటించారు. ఎవరు బయటకు రాకూడదు అని అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలి అని ప్రకటించారు. దీంతో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇకపోతే ఈ లాక్ డౌన్ వల్ల ఎందరో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తీర్థ యాత్రకు వెళ్లిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే ఓ కూతురు ఇబ్బందికి గురి కావడంతో తన కూతురును అయినా సరే ఇంటికి తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతో ఆ తండ్రి 5 రాష్ట్ర మీదుగా 2500 కిలో మీటర్లు దూరం.. 50 గంటలు ఏకధాటిగా కారు నడిపి తన కూతురును ఇంటికి తీసుకొచ్చాడు. ఈ ఘటన జార్ఖండ్‌‌లోని బొకారో‌ పట్టణంలో హోతు చేసుకుంది. 

 

అతనికి 49 ఏళ్ళు వయసు.. అతను ఓ మంచి డాక్టర్.. అతనికి 18 ఏళ్ళ కూతురు ఉంది.. ఆమె రాజస్థాన్‌లోని కోట పట్టణంలో చదువుతుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా కూతురు కోట పట్టణంలో చిక్కుకు పోయే ప్రమాదం ఉంది అని భావించిన ఆ డాక్టర్ మంగళవారం బయల్దేరి తన కూతురి వద్దకు చేరుకున్నాడు... సోషల్ డిస్టెన్సింగ్ కోసం ఆయన ఎక్కడా కారును ఆపకుండా కూతురుని చేరుకోగానే తనను తీసుకొని బయల్దేరాడు. 

 

అలా 50 గంటల్లో ఇల్లు చేరాడు. కోట, బొకరో పట్టణాల మధ్య దూరం 1250 కి.మీ. పైనే. రానుపోను 2500 కి.మీ. ఆయన ప్రయాణించారు. ఈ విషయంపై తన కూతురు మాట్లాడుతూ ఈ ప్రయాణాన్ని ఎప్పటికి మర్చిపోను అని.. తన డాడ్ నిజంగా సూపర్ డాడ్ అని ఆ కూతురు మురిసిపోయింది.. నిజంగా అతను సూపర్ డాడీనే. తండ్రి అంటే ఇలానే ఉంటాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: