ఏళ్ళేఎహె.. ఈ కరోనా వైరస్ గురించి ఏం అని చెప్తం.. ప్రపంచాన్ని వణికించేస్తున్న ఈ కరోనా వైరస్ ప్రజల అలవాట్లను.. లాగజారిస్ ని అన్నింటిని భూస్థాపితం చేసింది.. అసలు ఇంట్లో వంట చెయ్యకుండా ఎప్పుడు ఫుడ్ ఆర్దార్లు పెట్టుకునే వారికీ.. ఈ కరోనా వంట నేర్పిస్తుంది.. ఎప్పుడు బయట తిరిగే తిరిగుబోతులకు ఈ కరోనా వైరస్ ఇంట్లోనే కూర్చో పెడుతుంది.. తాగుబోతులకు చుక్క లేకుండా చేసింది.. 

 

కుటుంబంతో గడపాని బిజినెస్ మ్యాన్స్ ను ఇంటికే పరిమితం చేసింది.. అంతేకాదు.. ఇంకా ఎన్నో చేసింది ఈ కరోనా వైరస్. అసలు నడవని వారిని నడిపిస్తుంది.. ఈ కరోనా వైరస్ కారణంగా 19వేలమందికిపైగా మృతి చెందగా 4 లక్షలమంది ఈ కరోనా బారిన పడ్డారు. దీంతో భారత్ దేశమంతా లాక్ డౌన్ విధించారు. దీంతో మొత్తం అన్ని ఆగిపోయాయి. బస్సులు.. కార్లు అసలు రోడ్డుపై ఏమి తిరగడం లేదు అంటే నమ్మండి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే యూపీలోని ఉన్నావ్‌లో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలు వారి ఇంటికి వెళ్లడానికి బస్సులు.. కార్లు.. బైకులు ఇలాంటివి ఏవి లేకపోవడంతో పాపం వాళ్ళు కాలినడకన వారి గ్రామానికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంటికి వెళ్లలని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 36 గంటలు పాటు ఏకధాటిగా నడిచి ఇంటికి చేరుకున్నారు. 

 

అవధేస్‌ కుమార్‌ అనే యువకుడు మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో అతడితో పాటు తన గ్రామస్థులు కూడా ఉన్నారని.. సుమారు 36 గంటలు పాటు నడిచి 80 కి.మీ దూరంలో ఉన్న వాళ్ల ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఎంత లాక్ డౌన్ అయినప్పటికీ కూలీలతో పని చేపించుకోవడం కాదు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొంత నష్టం అయినా వారిని ఇంటికి చేర్చాలి.. ఆ బాధ్యత యాజమాన్యందే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి మీరు ఎం అంటారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: