కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికించేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 19వేలమందిని తీసుకెళ్లింది. అయినా ఆగటం లేదు.. రోజుకు వెయ్యిమందికి తీసుకెళ్తోంది ఈ కరోనా వైరస్. ఇంకా ఈ కరోనా వైరస్ బారిన నాలుగు లక్షలమంది పడ్డారు అంటే నమ్మండి. నాలుగు లక్షలమందిలో లక్షమంది ఈ కరోనా బారి నుండి తప్పించుకున్నారు. 

 

ఇంకా ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా భారత్ లో కూడా 11 మంది కరోనా బారిన పడి మృతి చెందగా 500 మందికిపైగా ఈ కరోనా బారిన పడ్డారు. దీంతో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలి అని లాక్ డౌన్ చేసారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే భారత్ నష్టాలలో కూరుకుపోతుంది. దీంతో దాతలు అంత ముందుకు వస్తున్నారు. వారికీ తోచిన సాయం వారు చేస్తున్నారు.. ఇప్పటికే ఆనంద్ మహీంద్రా వంటి బిజినెస్ వారందరు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు అందరూ చెయ్యగా ఇప్పుడు పార్లే బిస్కెట్ కంపెనీ ముందుకు వచ్చింది. 

 

పార్లే యాజమాన్యం.. లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు.. యాచకులకు ఇబ్బందులు తలెత్తుకుండా.. తమ వంతు సాయంగా మూడు కోట్ల బిస్కెట్ ప్యాకెట్లను అందజేయనున్నట్లు ప్రకటించింది. అది కూడా ప్రభుత్వ పరంగానే వాటిని సప్లై చేస్తామని ప్రకటించింది. కాగా.. ప్రస్తుతం తమ కంపెనీ 50 శాతం మంది వర్కర్స్ ను ఉపయోగించి పనులు చేయిస్తుందని పేర్కొంది. ఏది ఏమైనా కరోనా వైరస్ కారణంగా అందరూ ఇళ్లలో ఉండాలి అని ప్రభుత్వం ప్రకటించగానే వాళ్లకు వాళ్ళు ప్రజలంతా ఇళ్లలో దూరారు తప్ప.. యాచకులు. పేద ప్రజల గురించి ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది పార్లే బిస్కెట్స్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరు వారి గురించి ఆలోచిస్తున్నారు. గ్రేట్ పార్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: