రోజురోజుకూ విజృంభిస్తోన్న కరోనా వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా 18 వేలమందికి పైగా మృతి చెందారు. చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి ఇప్పటివరకు 174 దేశాలకుపైగా విస్తరించగా 4.15 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇటలీలో ఒక్కరోజే 743 మంది మృతి చెందారు. కరోనా నియంత్రణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినగాని కొంతమంది అధికారులు మాత్రం ఏమాత్రం పట్టి పర్వా లేనట్లు వ్యవహరిస్తున్నారు రోడ్ల పై అందరికి కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇస్తూ కనిపిస్తున్నారు తప్ప తమ పరిధిలో యధేచ్చగా కొనసాగుతున్న కంపెనీల జోలీకి మాత్రం పోవడం లేదు. ప్రభుత్వం అనుమతులు ఉన్నాయి అని కంపెనీ యజమానులు తమ సిబ్బంది అడిగిన వారికి చెబుతుంటే వారికి అధికారులే పరిశ్రమల యజమానులకు వత్తాసు పలుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏ స్థాయిలో పాటిస్తున్నారన్నది కొంత మంది అధికారులను చూస్తే అర్థమవుతుంది.

 

సామాన్యులు రోడ్లు మీదకు వస్తే చర్యలు తీసుకుంటాము అని హెచ్చరికలు చేస్తున్న పోలీసుల మాట కొంత మంది పెడ‌చెవిన పెట్టి వెళుతున్నారు. ఎంతో మంచిగా చెప్పుతున్నా విన‌డం లేదు. ఎవ్వ‌రైనా స‌రే అతి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఎంతో ప‌రిశుభ్రంగా ఉంటే త‌ప్పించి ఆరోగ్యంగా ఉండ‌లేమంటున్నారు. ఈ మ‌హ‌మ్మారిని మ‌న దేశం నుంచి త‌ర‌మాలంటే మ‌న‌లో మ‌న‌మే కాస్త జాగ్ర‌త్త‌గా కొన్ని రోజుల పాటు ఎవ‌రికి వారు క్వారంటీన్ చెయ్యాలంటున్నారు. ఇక దీని కోసం కొంత మంది పోలీసులు లేటెస్ట్ సాంగ్ ని పెట్టుకుని డాన్స్ చేసి మ‌రీ ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎవేర్‌నేస్ అనేది తీసుకువ‌స్తున్నారు. ఇక ఆ డాన్స్ వీడియోని చూస్తే మీకు అర్ధ‌మ‌వుతుంది. 

 

రాములో... రాములా అంటూ అల్లూ అర్జున్ స్టెప్పులేసిన పాట ఎంత వైరల్ అయ్యిందో.... అదే పాటను కరోనా వైరస్​పై అవగాహన కలిగించేందుకు విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు చేసిన వీడియో.. అంతే వైరల్ అవుతోంది. చూశారా అని కాదు... ఎన్నిసార్లు చూశారు అని అడగండి అంటారేమో...! ఆగండి... ఆగండి... మీరు చూసింది హీరో అల్లు అర్జున్ వేసిన దోశ స్టెప్పు... ఇప్పుడు చూస్తున్నది రియల్ హీరోస్ వేసిన దోశ స్టెప్పు. అదేనండి... పోలీసులు వేసిన దోశ స్టెప్పు... కాదు...కాదు... కరోనా స్టెప్పు.

 

కరోనా మహమ్మారి నియంత్రణకు మేము సైతం అంటూ విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు తమ వంతు ప్రయత్నం చేశారు. కరచాలనం వద్దు... నమస్కారం ముద్దంటూ... పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తూ డ్యాన్స్ చేశారు. షేర్ చేసి అందరికి తెలియచేయండి అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : ttps://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: