తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని సంతోషించే లోపే కరోనా గట్టి షాక్ ఇచ్చింది. కొద్దీ సేపటి క్రితమే తెలంగాణ లో 2, ఆంధ్రా లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈరోజు నమోదైన  కేసుల్లో 43ఏళ్ళ మహిళకు కరోనా పాజిటివ్ వున్నట్లుగా గుర్తించారు ఆమె ఇటీవల ఎక్కడికి  ప్రయాణించకున్నా ప్రైమరీ కాంటాక్టు ద్వారా ఈవైరస్ సోకింది ఆమె తోపాటు సౌదీ అరేబియా నుండి వచ్చిన మూడేళ్ల పాప  కు కూడా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. దాంతో తెలంగాణ లో మొత్తం ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 41కి చేరింది. 
 
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈరోజు ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణయింది. అందులో ఒకరు విజయవాడ వాసి ఇటీవలే అతను వాషింగ్ టన్ నుండి రాగ  మరొకరు గుంటూరు చెందిన వ్యక్తి అని సమాచారం. అతను కూడా కొద్దీ రోజుల క్రితమే ఢిల్లీ నుండి వచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరితో కలిపి  ఆంధ్రా లో కరోనా కేసుల సంఖ్య 10 కి చేరింది. మరోవైపు లాక్ డౌన్ అమలు లో వున్నా కూడా కరోనా కేసులు నమోదవుతుండడం తో  ప్రజలు ఇప్పటికైనా లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకొని ఇంట్లో ఉండాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 
 
ఇక ఇదిలావుంటే హైదరాబాద్ హాస్టళ్ల లో వుండే వారితో ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. హాస్టల్ యజమానులు వారిని ఖాళీ చేయమని వేదిస్తుండడం తో  వారంతా ఒక్క సారిగా దగ్గర్లో వున్న పోలీస్ స్టేషన్ల కు పరుగులు తీశారు. తమకు తినడానికి తిండి కూడా లేదని మమ్మల్ని మా ఊళ్లకు వెళ్లనివ్వాలని కోరడం తో సొంత వాహనాలు కలిగిన వున్నా వారికీ ఊళ్లకు వెళ్ళడానికి పోలీసులు ఎన్ ఓ సి ని ఇచ్చారు. అయితే  హాస్టల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో మూసివేయకూడదని కొద్దీ సేపటి క్రితమే తెలంగాణ డిజిపి అల్టిమేటం జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: