దేశంలోని ప్రజలంతా కరోనా భయంతో అల్లాడిపోతున్నారు. పూర్తిగా ఇంటికే పరిమితయ్యారు. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ని అడ్డుకోవాలంటే స్వీయ నిర్భంధం తప్ప మరో మార్గం లేదన్న సంగతి తెలిసిందే. దాంతో అందరు గడప దాటి అడుగు బయట పెట్టడం లేదు. ఒకవేళ విదేశాల నుంచి ఎవరైనా వచ్చినా కొన్నాళ్ళ పాటు క్వారంటైన్ లో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా హైదరాబాద్ నగరంలోని మణికొండలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మణికొండలో 64 ఏళ్ల వృద్ధురాలతికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. బాధితురాలిని స్వీడన్ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ యువకుడి కుటుంబసభ్యురాలిగా గుర్తించారు. తాజాగా కేసుతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు చేరింది. 

 

ఇక ఒక్క రోజులోనే నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు అజాగ్రత్తగా ఉండరాదని ప్రభూత్వాలు వెల్లడించాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. హోం క్వారంటైన్ పై గట్టి నిఘా పెట్టామని, బయట తిరిగితే పాస్ పోర్టు సీజ్ చేయమని ఆదేశాలిచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాత్రి 7 నుంచి మార్నింగ్ 6 వరకు కర్ఫ్యూ ఉంటుందని ఈ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. మనిషి వీధిలోకి వస్తే కఠిన చర్యలుంటాయని ఇప్పటి వరకు పోలీసులు జనాలకి దండం పెట్టి బ్రతిమాలారని.. ఇప్పుడు అలా బ్రతిమాలే ప్రసత్కే లేదని కఠినంగా వ్యవహరిస్తారని అన్నారు. 

 

ఇక సిటీ వళ్ళకంటే గ్రామాలలో ఉన్నవాళ్ళు చాలా నయమని .. కొన్ని గ్రామాలకు కంచెలు వేసుకున్నారని ఇలా ప్రతీ ఒక్కరు పాటించాలని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల మూడు కమిషనరేట్ల పరిధిలో పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చాయని తెలిపారు. ప్రజలు నియంత్రణ పాటించాలని... వ్యాధి కంట్రోల్ లోనే ఉందని.. లోకల్ ట్రాన్సిమిట్ కేసు నమోదు కాలేదని అన్నారు.

 

ప్రధాని నరేంద్ర మోడీ కూడా నేటి రాత్రి నుంచి మూడు వారాలపాటు దేశం మొత్తం లాక్ డైన్ అని ప్రకటించారు. దేశంలో ఇప్పటి వరకు 539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణతోపాటుతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో పది కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. అయితే ఎవరూ ఈ విషయంలో అపోహలకి పోవద్దని ప్రజలమదరికి మేము అండగా ఉంటామని మాకు సహకరించాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: