కరోనా దెబ్బకి ప్రపంచ దేశాల ప్రజలు ప్రాణాలను పోగొట్టుకోవడమే కాదు మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయింది. ఇప్పటికే సాఫ్ట్ వేర్, సినిమా రంగాలతో పాటు పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీలకి కోట్లలో నష్టం వాటిల్లింది. దాంతో ఆర్ధిక అభి వృద్ధి శాతం భారీగా తగ్గడం తో దేశంలో ఇప్పటికే కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ భారీ ఎత్తున ప్రభావం పడిందని ఖచ్చితంగా చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను మళ్ళీ చక్క పెట్టేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించవచ్చని తాజా సమాచారం.

 

మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే రూ.1.5 లక్షల కోట్లకు పైగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించబోతుందని సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మధ్య ప్యాకేజీకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఈ అంశంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి ఆర్థిక ప్యాకేజీ రూ.2.3 లక్షల కోట్లుగా ఉండొచ్చని తెలిపారు. ఈ వారం చివరిలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటన ఉండవచ్చని సంబంధిత వర్గాలు సమాచారం అందించాయి. ఆర్థిక ప్యాకేజీ డబ్బులను నేరుగా పేదల అకౌంట్లలోకి బదిలీ చేస్తారని దీని వల్ల వందల కుటుంబాలకి చేయూతనందించబోతున్నారని విశ్వనీయ వర్గాల సమాచారం. దేశంలోని 10 కోట్ల మందికి పైగా పేద వారి అకౌంట్లలో నేరుగా ఈ డబ్బులు జమ కానున్నాయట. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారులకు కూడా ప్రయోజనం కలుగనుందట.

 

ఇక కరోనా వైరస్ చాలా శరవేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో ఇప్పటికే కరోనా కేసులు 570 పైకి చేరాయి. ఇక అంతరర్జాతీయంగా చూస్తే.. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే 16 వేల మందికి పైగా మరణించారు. అలాగే 3 లక్షల మందికి పైగా వైరస్ సోకింది. ఇందుకు ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఎప్పకప్పుడు కఠిన నిర్ణయాలను తీసుకుంటూ కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రభూత్వాలు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: