కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తుతం జాతీయ లాక్ డౌన్ జరుగుతున్న సందర్భంగా పోలీసులకు పూర్తి అధికారాలు చేసిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రాల్లో ఎవరైనా కారణం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నట్టు కనిపిస్తే పోలీసులు వారి లాఠీలకు పని చెబుతున్నారు. ఇటువంటి కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రజలు కొంచెం కష్టమైనా ఇదంతా తమ శ్రేయస్సు కోసమే కాబట్టి ఇళ్లలోనే గడుపుతున్నారు.

 

అయితే ఇప్పుడు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వందలాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారి సొంత రాష్ట్రానికి తరలి వెళ్ళేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వారిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే పోలీసులు నిలువరించారు. తెలంగాణ నుండి వారు ఎన్ఓసి అనగా 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' తీసుకొని వచ్చినా కూడా వారిని ఆంధ్ర రాష్ట్రంలో కి రానివ్వడం లేదు అంటే పరిస్థితి అక్కడ ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అసలు తమ రాష్ట్రంలో కి తమను అనుమతించకపోవడం ఏమిటని ఏపీ ప్రజలు విపరీతంగా ఆగ్రహిస్తున్నారు.

 

విషయం ఏమిటంటే హైదరాబాద్ లో చదువుకుంటున్న వేలాది మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను హాస్టల్స్ నుండి పంపించేశారు. వారు అక్కడ ఇక్కడ తిరిగి ఎక్కడ కరోనా తెచ్చుకుని తమ అంటిస్తారో అని భయంతో తెలంగాణ ప్రజలు అలా ప్రవర్తిస్తూ ఉండగా ఆంధ్ర ప్రజలు కూడా హైదరాబాదులో ఎక్కువగా ఉన్న కేసులు నమోదు కావడంతో తమ రక్షణ కోసం సొంత ఇంటికి ప్రయాణం అవుతూ ఉండగా ఇప్పుడు దాదాపు ఆరు గంటల నుండి సరిహద్దులో ఇలా ఇరుక్కొనిపోయారు.

 

ఇకపోతే అటువైపు తెలంగాణ ప్రజలు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అసలు విషయంపై త్వరగా స్పందించి ఏదో ఒక స్పష్టత ఇవ్వకుండా ఉన్నందుకు తీవ్రంగా విమర్శిస్తూ ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణ ముఖ్యమంత్రిని కొద్దిరోజులకే తమ రాష్ట్రానికి అనవసరంగా పంపించేస్తున్నారు అన్న భావనలో ఉన్నారు. అయితే ఇద్దరి తరపున న్యాయం ఉన్నా ఇప్పుడు అంత మంది జనం ఒకేచోట సరిహద్దు ప్రాంతంలో గుమిగూడి ఉంటే కరోనా స్వైర విహారం చేస్తుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు తమ ముఖ్యమంత్రులను విపరీతంగా తిట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: