చైనా కేంద్రంగా పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు యూరప్ లో మరణ మృదంగం మోగిస్తోంది. ప్రతి రోజూ వందల్లో అక్కడ చనిపోతున్నారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న యూరప్ దేశాల్లో ఇటలీ, స్పెయిన్ ప్రధానంగా ఉన్నాయి. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం.. స్పెయిన్ కూడా కరోనా వైరస్ ధాటికి అల్ల కల్లోలంగా మారుతోంది.

 

 

ఈ దేశంలో ఒక్కరోజే ఏకంగా 656 మందిని కరోనా బలి తీసుకున్నట్టు స్థానిక మీడియా చెబుతోంది. స్పెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కరోనా మరణాల్లో ఆ దేశం చైనాను దాటిపోయింది. చైనాలో 3,285 మంది మాత్రమే మరణించారు. కానీ స్పెయిన్‌లో ఈ సంఖ్య 3,647 కు చేరుకుంది. ఇక మరో యూరప్ దేశం ఇటలీ సంగతి చెప్పనక్కర్లేదు.

 

 

మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కరోనాకు బలైన వారి సంఖ్య 21 వేలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య నాలుగున్నర లక్షలు దాటింది. అయితే వీరిలో లక్షా 14 వేలమంది వరకూ కోలుకోవడం కాస్త శుభ సూచకంగా కనిపిస్తోంది.

 

 

ఈ కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అవి పూర్తిగా ఫలించడం లేదు. ఈ మహమ్మారికి మందు కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి మందు కనిపెట్టే లోపు ఇది విజృంభించి వేల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకుంటోంది. సామాజిక దూరం పాటించడం ఒక్కటే ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకట్టే ఆయుధంగా కనిపిస్తోంది. అందుకే దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్‌ డౌన్ ప్రకటిస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈ మహమ్మారి ఉధృతికి అడ్డుకట్ట పడేదెన్నడో..?

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: