కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఎక్కడో కొందరు మినహా పెద్దగా ప్రజలు ఎవరూ కూడా రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. మన దేశంలో నిత్యం ప్రజలు చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా సరే బయటకు వస్తూ ఉంటారు. అలాంటి వారు అందరూ కూడా ఇప్పుడు బయటకు రావడం లేదు అనే చెప్పాలి. ప్రస్తుత౦ దేశంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లోనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

 

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో దీనిని పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ప్రజలు అందరూ కూడా సరుకుల కోసం బార్లు తీరుతున్నారు. షాపుల చుట్టూ ప్రజలు అందరూ కూడా క్యూ కడుతున్నారు. సరుకులు దొరికే అవకాశం ఉండదు అనే హెచ్చరికల నేపధ్యంలో ఇప్పుడు అప్రమత్తమవుతున్నారు. ఎక్కడ లాక్ డౌన్ ని మరింత కాలం పెంచుతారో అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. దీనితోనే ప్రజలు అందరూ కూడా ఇప్పుడు మూడు నాలుగు నెలలకు సరిపడా సరుకులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. 

 

దీనితో సరుకులు అన్నీ కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా దొరికే అవకాశం కనపడటం లేదు. ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో సరుకుల కొరత ఆకలి కేకలకు కూడా కారణమవుతుంది అని హెచ్చరిస్తున్నారు పలువురు. మన దేశ వ్యాప్తంగా కూడా పిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఎక్కువ కాబట్టి వీళ్ళు అందరూ బయటకు వచ్చి ఇప్పుడు ఎక్కువగా సరుకులను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ధరలు కూడా పెరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: