దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ ఊహకు కూడా అందని విధంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాక కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా అసహనంగానే ఉంది. అది ఎటు నుంచి వస్తుంది ఎలా వస్తుందో కూడా ఎవరికి అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఒక్కసారి అది ఒక్కరికి వచ్చింది అంటే చాలు వేల మందికి రోజుల వ్యవధిలో సోకుతుంది. దీనితో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్నీ కట్టడి చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించారు. ఏ ఒక్క వ్యాపారం కూడా ఇప్పుడు నడవడం లేదు దేశం మొత్తం. కట్టడి చేయడానికి దీనికి మినహా మరో మార్గం లేదు ఇప్పుడు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు పడిపోయాయి కాబట్టి ధరలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ నిర్మించాలి అంటే కచ్చితంగా ఇప్పుడు అది మినహా మరో మార్గం లేదు అని ఎందరో అభిప్రాయపడుతున్నారు. ప్రతీ దేశం కూడా కరోనా వ్యవస్థ దెబ్బకు ఇలాంటి ఇబ్బందులు పడటం ఖాయమని ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోవడమే కాకుండా ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నా గాని సాధ్యం కాదని ధరలు పెరగడమే మార్గం మినహా మరొకటి లేదని అంటున్నారు. 

 

దేశంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు సహా వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ధరలు పెరిగిపోవడం అనేది దాదాపుగా ఖాయమనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. పప్పులు ఉప్పులు బియ్యం అన్నీ కూడా పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. పెట్రోల్ సహా ఇతర ధరలు కూడా భారీగా పెరగడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్ధిక నిపుణులు కూడా ఇదే విషయం చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి జాగ్రత్త అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: