కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో విధించిన కర్ఫ్యులో భాగంగా రోడ్ల మీద మనుషులు కనిపిస్తే పోలీసులు చితక్కొట్టుడు కొడుతున్నారు.. కొత్తగా డ్యూటీలో చేరినవారు, పాత వారు అనే తేడా లేకుండా ఇన్నాళ్లుగా ఉపయోగించకుండా ఉన్న లాఠీల దుమ్మును దులుపుతున్నారు.. పిక్కలు పగులుతున్నాయి.. పిర్రలకు వాతలు వస్తున్నాయి.. అయినా గానీ వినని కొందరు పనికిమాలిన వారు దెబ్బలకి సిద్దపడే రోడ్లమీద రయ్యిన దూసుకుపోతున్నారు..

 

 

ఇకపోతే పోలీసులు పాషాణ హృదయాలు కలిగిన వారని అందరు అంటుంటారు.. కానీ పోలీసుల్లో మంచి పోలీసులు వేరయా అన్నట్లుగా కొందరు మాత్రం తమ విధినిర్వహణ సక్రమంగా చేస్తూనే, మనసున్న మనుషులుగా అవకాశం దొరికినప్పుడు సహాయం చేస్తుంటారు.. ఇలాగే చేసిన ఓ ఎస్‌ఐ తన మానవత్వాన్ని నిరూపించుకున్నాడు.. మంగళవారం సాయంత్రం వారసిగూడ నుంచి చిలకలగూడ పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్న సమయంలో ఎస్‌ఐ గంగిరెడ్డి వాహనానికి ఒక మహిళ అడ్డువచ్చింది. అది చూసిన ఆయన ఆమెను కోపగించుకోకుండా తన వాహనాన్ని అపి ఏమైందని ఆరా తీసాడు... దానికి ఆమె బాధగా తన కోడలు పురిటి నొప్పులతో బాధ పడుతుందని.. హస్పిటల్‌కు తీసుకు వెళ్లుదామంటే రోడ్లపై ఆటోలు కనిపించడం లేదని వేడుకుంది..

 

 

వెంటనే స్పందించిన బాలగంగిరెడ్డి తాను కిందికి దిగి తన వాహనంలో ఆ గర్భవతిని డ్రైవర్ సహాయంతో స్ప్రింగ్ హాస్పిటల్‌లో చేర్చారు.. ఇదే కదా మానవత్వం అని అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.. ఇకపోతే ఇదే ఎస్ఐ గాంధీ ఆసుపత్రిలో ఓ డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో ఆ వైద్యుడిని అతి చాకచక్యంగా కాపాడి ప్రజల మన్ననలను పొందడమే కాకుండా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చేతుల మీదుగా 10 వేల రూపాయల రివార్డు కూడా అందుకున్నారు... 

 

 

ఇదిలా ఉండగా కరోనా వైరస్ నివారణ వ్యాప్తికి కారణమవుతున్న వారి విషయంలో కఠిన చర్యలు చేపట్టడమే కాకుండా, కారణం లేకుండా రోడ్ల మీద షికార్లు కొట్టే ఆ కొడుకులను ఊరికే వదిలి పెట్టవద్దు.. ఈ విషయంలో అధికారులు మరింతగా దయ, జాలి లేకుండా ప్రతివారు బయట తిరగకుండా, అలాగే విదేశాల నుండి వచ్చే వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: