తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే గత నాలుగైదు రోజుల్లో పెరిగినట్టు రోజులు నాలుగైదు కేసులు మాత్రం పెరగడం లేదు. కొత్తగా ఓ మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే తెలంగాణలో రెండో విడత కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 

 

ఇప్పటి వరకూ తెలంగాణలో రెండో దశ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. వీరిలో ముగ్గురు మహిళలు. బుధవారం నిర్ధారించిన ఇద్దరితో కలిపి ప్రస్తుతం 40 మంది కరోనా బాధితులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. హైదరాబాద్ లో ఓ మూడేళ్ల పసివాడికి కరోనా సోకింది. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బాలుడితో సహా ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చింది. బాలుడిలో జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయిస్తే ఆ పసివాడికి కరోనా ఉందని తేలింది.

 

 

ఆ పసివాడికి తల్లిదండ్రులకూ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి ఇటీవలే లండన్‌ నుంచి వచ్చారు. ఆయనకు కరోనా ఉందని ఇప్పటికే నిర్థరణ కాగా ఇప్పుడు గా ఆయన భార్యకు కూడా కరోనా వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41 కు చేరుకుంది. అయితే కొత్తగూడెంలో కరోనా ఎంత వరకూ వ్యాపించిందన్న ఆందోళన కలవరం కలిగిస్తోంది.

 

 

కొత్తగూడెం డీఎస్పీ కుమారుడి ద్వారా డీఎస్పీకి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో పని మనిషికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారించిన నేపథ్యంలో అక్కడి పరిసర ప్రాంతాలను వైద్య ఆరోగ్యశాఖ బృందం తనిఖీ చేస్తోంది. వీరు ఎవరెవరిని కలిశారన్న విషయంపై ఆరా తీస్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: