చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నాయ‌కుడు. వైసీపీలో ఆయ‌న ఓ ఫైర్ బ్రాండ్‌. ప్ర‌తిప‌క్షాల‌కు ఆయ‌నంటే హ‌డ‌ల్‌. చెవిరెడ్డి పేల్చే తూటాల వంటి మాట లకు కౌంట‌ర్లు వేయాలంటే మాట‌లు కూడా చాల‌వు. వైసీపీకి అన్ని విధాలా అండ‌గా ఉంటూ.. జ‌గ‌న్ అడు గు జాడ‌ల్లో న‌డుస్తున్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అదేస‌మ‌యంలో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం లోనూ ప్ర‌జ‌ల‌కు అన్నీతానై వ్య‌వ‌హ‌రించ‌డంలోనూ చెవిరెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ పండ‌గ వ‌చ్చి నా.. ఆయ‌న ముందుంటారు. పేద‌ల‌కు బ‌ట్టలు పెడ‌తారు.



ఇక‌, మునిసిపాలిటీ కార్మికుల‌కు కూడా ఆయ‌న స్వీట్లు పంచుతూ.. వారికి అన్ని విధాలా నేనున్నాన‌నే భా వన క‌ల్పిస్తారు. మొత్తంగా చూస్తే.. చెవిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ ఐకాన్‌. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల నే త త్వంతో ముందుకుసాగుతున్నారు. ఎవ‌రు ఏ స‌మ‌స్య‌పై ఆయ‌న ఇంటికి వెళ్లినా.. ఎదురొచ్చి మ‌రీ వారి స‌మ స్య‌ల‌ను తెలుసుకుని, ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారు. ప్ర‌స్తుతం దేశం మొత్తం కూడా క‌రోనా ఎఫెక్ట్‌తో తాళం వేసుకుంది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ అన్నీ స్తంభించిపోయాయి అయితే, క‌రోనాకు మందు లేక‌పోవ‌డంతో ముందు జాగ్ర‌త్త‌లు మాత్ర‌మే తీసుకోవాల్సి ఉంది.



ఈ క్ర‌మంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌, మ‌థ్య‌త‌ర‌గతి వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకున్న చెవిరెడ్డి.. నియో జ‌క‌వ‌ర్గంలోని 1600 గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌కు శానిటైజ‌ర్ బాటిళ్ల‌ను, క‌రోనాపై తీసుకోవాల్సిన ముందు జాగ్ర‌త్త ల‌తో కూడిన క‌ర‌ప‌త్రాల‌ను పంచారు. అదేవిధంగా నియోజ‌క‌వ‌ర్గంలోని న‌గ‌రాల్లో కూడా ప్ర‌తి ఇంటికీ శాని టైజ‌ర్ బాటిల్‌ను పంచారు.దీనికిసంబంధించి 3.5 ల‌క్ష‌ల శానిటైజేష‌న్ బాటిళ్ల‌ను చెవిరెడ్డి త‌న సొంత ని ధుల‌తో కొనుగోలు చేశార‌ని అంటున్నారు. అయితే, ఈ నెల 31న‌కూడా మ‌రో ద‌ఫా అంద‌రికీ శానిటైజేష‌న్ బాటిళ్ల‌ను పంచిపెట్ట‌నున్న‌ట్టు చెవిరెడ్డి పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి చెవిరెడ్డి కృషిని, ఆయ‌న సేవా దృక్ఫ‌థాన్ని గ‌మ‌నించిన వారు శ‌భాష్ అంటూ కొనియాడుతున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: