కరోనా కారణంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్టళ్లలో ఉన్నవారు నరకం అనుభవించారు. కరోనా భయంతో ఇక్కడి ప్రైవేటు హాస్టళ్లను మూసేశారు. కానీ అందులో ఉంటున్న వారు చిక్కుకుపోయారు. పోనీ సొంత ఊళ్లకు వెళ్దామంటే బస్సుల్లేవు..రోడ్డుపైకి వస్తే చాలు పోలీసులు కొడుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక వారంతా.. హైదరాబాద్ లో పోలీసులను ఆశ్రయించారు. వేల సంఖ్యలో హాస్టళ్ల విద్యార్థులు రావడంతో పోలీసులు కూడా కాస్త మెత్తబడ్డారు. వారి ప్రయాణానికి అనుమతిస్తూ పాసులు ఇచ్చారు.

 

 

అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. వివిధ వాహనాల్లో ఏపీకి చేరుకుందామని బయలుదేరిన వారికి సరిహద్దుల్లో ఏపీ పోలీసులు చుక్కలు చూపించారు. కరోనా కారణంతో సరిహద్దులు మూసేశామని వారిని ఏపీలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో సరిహద్దుల్లో వారంతా పడిగాపులు కాశారు. చివరకు ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు.

 

 

రాత్రి సమయంలో కేసీఆర్, జగన్ ఫోన్‌లో చర్చించారు. ఇప్పటి వరకూ సరిహద్దులకు చేరుకున్న 8 వేల మందికి అనుమతి ఇస్తామని.. ఇకపై ఎవరినీ రానియ్యబోయమని ఏపీ తేల్చి చెప్పింది. ఇందుకు కేసీఆర్ సైతం అంగీకరించడంతో సమస్య పరిష్కారం అయ్యింది. అప్పటి వరకూ రోడ్లపైనే వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సరిహద్దులకు చేరుకున్న ఏపీ వారిని ప్రత్యేక కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షల అనంతరం ఇళ్లకు పంపిస్తారు.

 

 

బుధవారం అర్ధరాత్రి వేల మంది విద్యార్థులను వైద్య పరీక్షల కోసం వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుట్‌ ఐటీకి, తూర్పుగోదావరి వారిని రాజమహేంద్రవరం, పశ్చిమగోదావరి వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఇక హైదరాబాద్‌ నుంచి ఎవరు వచ్చినా అనుమతించేది లేదని సరిహద్దుల వద్ద ఏపీ అధికారులు స్పష్టం చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: