సోషల్ మీడియాలో ఇప్పుడు కరోనా వైరస్ గురించి జనాలు పండగ చేసుకుంటున్నారు. కరోనా వైరస్ అలా వస్తుంది ఇలా వస్తుంది అంటూ ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. అయితే కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు చేస్తున్న చర్యల గురించి మాత్రం కొందరు చేస్తున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇటీవల రష్యాలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ ని కట్టడి చేసి జనాలను ఇంట్లోనే ఉంచడానికి గాను ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. 

 

ఇటీవల సింహాలను వదిలి పెట్టారు రోడ్ల మీద అంటూ ఒక కొత్త ప్రచారం చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. ఇది నిజం కాదనే విషయం అందరికి తెలుసు. 800 సింహాలను రోడ్ల మీదకు వదిలారని సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. కాని అది నిజం కాదు. అలాంటిది చేస్తే జనాలు వెంట పడి కొడతారు. అది పక్కన పెడితే మరో ప్రచారం విషయానికి వస్తే హంటా వైరస్ ముందు రష్యాలో వచ్చింది అని కూడా ప్రచారం చేసారు. అక్కడి నుంచి మన దేశానికి కూడా వస్తుంది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. రష్యా అధ్యక్షుడు మన దేశంలోకి పంపారని ప్రచారం చేసారు. 

 

ఇక మరోక ప్రచారం విషయానికి వస్తే బయటకు వచ్చిన వాళ్ళను రష్యా ప్రభుత్వం కాల్చి చంపుతుంది అంటూ కూడా ఒక కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇది కూడా నిజం కాదు. మరో దేశ అధ్యక్షుడి మీద కూడా ఇలాగే ప్రచారం చేసారు. ఇటలీ అధ్యక్షుడు పరిస్థితి చూడలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎవరిని కాపాడుకోలేము అంటూ ఎడ్చాడని కూడా చెప్పారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఒక స్థాయిలో జరిగింది. కాని అది కూడా ఏ విధంగా చూసినా నిజం కాదు. అసలు ఆయన ఇటలీ అధ్యక్షుడు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: