తెలంగాణ లాక్ డౌన్‌ తో రాష్ట్రం స్తంభించింది. బయటకు వెళ్తే పోలీసులు కుమ్మేస్తున్నారు. నిత్యావసరాల కోసం ప్రత్యేకించి కూరగాయలు, సరుకుల కోసం జనం బయటకు వెళ్లక తప్పట్లేదు. అందుకే కేసీఆర్ సర్కారు నగరాలు, పట్టణాల్లో సంచార రైతు బజార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే ఓ వాహనంలో మన ఇళ్ల వద్దకే కూరగాయలు వస్తాయన్నమాట.

 

 

సరకులు, కూరగాయల వంటివి ఇళ్ల వద్దకే పంపడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచే వాహనాల ద్వారా ఇళ్ల వద్దకు కూరగాయల సరఫరాకు కొన్ని వాహనాలను కేటాయిస్తోంది. నిత్యావసర సరకుల కొనుగోలుకు గుంపులుగా వస్తున్న ప్రజలను, రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్ డౌన్ ప్రకటిస్తే.. రైతు బజార్ల వద్ద మాత్రం గుంపులు గుంపులుగా జనం ఎగబడుతున్నారు.

 

 

దీంతో లాక్ డౌన్ అసలు లక్ష్యం నీరుకారిపోయే ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో సంచార కూరగాయల విక్రయ వాహనాలను ప్రవేశపెట్టాలని తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ డిసైడైంది. రాష్ట్రవ్యాప్తంగా 300 వరకూ వాహనాలను ఇందుకోసం వినియోగించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం రైతు బజార్లలో అమ్ముకుంటున్న వారికే ఈ బాధ్యత అప్పగిస్తారు. ఒక్కో కాలనీకి 2, 3 రోజులకు ఒకసారి ఈ వాహనాలు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

 

 

నిత్యావసరాల కోసం వచ్చే వారు అవసరానికి మించి కొంటున్నారు. అయితే తెలంగాణలో కూరగాయల కొరత లేనే లేదని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా 30 లక్షల టన్నుల కూరగాయలు పండుతున్నాయి. రాష్ట్రానికి అవసరమైనవి 27 లక్షల టన్నులేనని తేల్చిచెప్పింది. అందుకే ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని తెలంగాణ సర్కారు చెబుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: