తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా దేశాలనే చుట్టేస్తోంది. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. ఒకరి నుంచి మరొకరి ఈ వైరస్ సోకడంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలుదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. ప్రజలను కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించాయి. దీంతో వచ్చే ఏప్రిల్ 14వరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాల్సిందే. ఇలా సామాజిక దూరం పాటించడం వల్ల.. వ్యాప్తి తీవ్రతను బట్టి 89శాతం వరకు వైరస్ ను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. 

 

కావున దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న 21రోజుల లాక్ డౌన్, స్క్రీనింగ్, ప్రయాణాలపై ఆంక్షలు.. వైరస్ కట్టడి ఉపయోగపడతాయని పేర్కొంది. దీంతొ చాలామంది ఈ సుదీర్ఘ పీరియడ్‌ని ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. మ‌రికొంద‌రు అవేమి ప‌ట్టించుకోకుండా బ‌య‌ట తిరిగేస్తున్నారు.  లాక్ డౌన్ చేస్తే, బయట ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించిన పోలీసు మీద ఓ యువతి వీరంగం సృష్టించింది. పోలీసులతో గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఏకంగా ఓ పోలీస్ ఆఫీసర్‌ చేతిని కొరికింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. 

 

కోల్‌కతాలో నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు మీద క్యాబ్ వస్తుండడంతో చూసి పోలీసులు ఆపారు. లాక్ డౌన్ విధించిన టైమ్‌లో ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని పోలీసులు ప్ర‌శ్నించారు.  తాము మెడిసిన్స్ తీసుకురావడానికి వచ్చామన్నారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు ప్రిస్కిప్షన్ అడిగితే లేదన్నారు. ఇంతలో కారులో కూర్చున్న ఓ యువతి బయటకు వచ్చి వారితో గొడ‌వ‌కు దిగింది. అంతలోనే ఆ యువతి మరింత క్రూరంగా మారిపోయింది. ఓ పోలీసు చేతిని గట్టిగా కొరికేసింది. అక్క‌డితో ఆగ‌ని ఆమె.. తనకు గతంలో తగిలిన దెబ్బను గిచ్చి.. అక్క‌డ‌ వచ్చిన రక్తాన్ని పోలీస్ ఆఫీస‌ర్‌పై ఊసింది. ఆ త‌ర్వాత ఆమె అక్క‌డ నుంచీ వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేసి ఆరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: