దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో  ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఎవరూ బయటికి వెళ్లొద్దని, ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకే ప్రాంతంలో వందల మంది గుమికూడి ఉండడంతో పోలీసుల తీరుపై మంత్రి హరీష్ రావు  ఆగ్రహం వ్యక్తం చేసారు. లాక్ డౌన్ తీరు పరిశీలనలో భాగంగా సంగారెడ్డిలో సమీక్ష ముగించుకుని హైదరాబాద్ చేరుకునే సమయంలో మార్గమధ్యలో పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడటం గమనించారు. అయితే వెంటనే కాన్వాయ్‌ దిగి అక్కడికి వెళ్ళిన మంత్రి అక్కడి పరిస్థితిపై ఆరా తీసారు. అయితే వారంతా విద్యార్థులని సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతి కోసం వచ్చారని పోలీసులు మంత్రికి వివరించారు. దీంతో పోలీసుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేసారు.

 

రాష్ట్రంలో ఓ  వైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో వారిని ఇంత సేపు ఇలా ఒక్క చోట ఉండటం ఏంటని ప్రశ్నించారు. త్వరగా అందరికీ అనుమతి ఇప్పించి పంపాలని ఆదేశించారు. అలానే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు మంత్రి హరీష్ రావు. అలానే అధైర్య పడొద్దని వారికి భరోసా కల్పించారు. కాగా మంత్రి హారీష్ వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే వారిని ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు  సూచించారు. ప్రభుత్వ నియమాలు, ఆదేశాలు ఉల్లంఘిస్తే అన్ని హాస్టల్స్‌, పీజీ మేనేజ్‌మెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.  ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి డీజీపీ ఆదేశించారు. ఇక హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో సొంత ఊర్లకు వెళ్లాలని ఆశపడిన స్టూడెంట్స్, ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: