ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో అక్కడేమో మీ ప్రాణాలు కాపాడటానికి మా ప్రాణాలు ఇస్తున్నాం.. మీరేమో ఇక్కడ బాధ్యత లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంటారు.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం.. ఒక్క తెలుగు రాష్ట్రం ఏంటీ అన్ని రాష్ట్రాల్లో కొంత మంది ఆకతాయిలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.  ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.. కానీ కొంత మంది మాత్రం బయటకు వచ్చి బైక్స్ పై చక్కర్లు కొడుతున్నారు.  లాక్‌డౌన్ వేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను చూసి ఆగలేకపోతున్న కుర్రకారు బైకు లేసుకుని ఎంచక్కా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. లాంగ్‌డ్రైవ్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. 

 

ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన సమయంలో కొంత మంది ఏకంగా బస్టండ్ లోకి వచ్చి క్రికెట్ ఆడుకున్న విషయం తెలిసిందే.  ఇలా సామాజి బాధ్యత ఏమాత్రం లేకుండా తిరుగుతున్నవారిని ఎంతమందిని పోలీసులు కట్టడి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.  పోలీసులు వీరిని ఆపినప్పుడు చెబుతున్న కారణాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తా వద్ద రాచకొండ పోలీసులకు దొరికిన ఓ యువకుడు చెప్పిన కథ పోలీసులను హైరానా పెట్టించింది.   తమ స్నేహితుడు కనిపించడం లేదని.. అతని ఫోటో చూపించి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. దీన గాధ చెప్పారు కుర్రాళ్లు. 

 

పోలీసుల సైతం వారు చెప్పింది నమ్మిన పోలీసులు ఆ ఫొటో తీసుకుని అతడు కనిపిస్తే చెప్పాలని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించేందుకు రెడీ అయ్యారు.  అయితే ఆ కుర్రాళ్ల నడవడి చూసి అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పారు.. రోడ్లు ఖాళీగా ఉన్నాయని.. లాంగ్ డ్రైవ్ కి వెళ్లడానికి వచ్చామని చెప్పారు. నగరంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. రక్తదానం కోసం అంటూ ఒకరు, తమవారు ఆసుపత్రిలో ఉంటే చూడడానికి వెళ్తున్నామని మరొకరు ఇలా రకరకాల కారణాలు చెప్పి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: