కరోనా వైరస్ పై పోరు కోసం అంతా కలసి వస్తున్నారు. సెలబ్రెటీలు, సినీతారలు, రాజకీయ నాయకులు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఓ అడుగు ముందు కేశారు. అంతా కలసి దాదాపు 500 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. అధికార టీఆర్‌ఎస్‌ చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం అందించారు.

 

 

అంతే కాదు.. ఈ ప్రజా ప్రతినిధులంతా ఒక ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ఇదంతా కలిపి దాదాపు రూ. 500 కోట్లకు చేరింది. ఎలాగంటే ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ. ఐదు కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధులు వస్తాయి. వాటిని ఆయా ఎంపీలు తమ విచక్షణ మేరకు ఖర్చు చేస్తుంటారు. టీఆర్‌ఎస్‌ కు 16 మంది ఎంపీలున్నారు. ఈ ఏడాది వారికి 80 కోట్ల రూపాయలు మంజారవుతాయి. 80 కోట్లను సీఎం సహాయనిధికి ఇవ్వడానికి ఎంపీలు నిర్ణయించారు. ఇలా నియోజక వర్గ నిధులతో పాటు తమ ఒక నెల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి అందిస్తారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత తెలిపారు.

 

 

ఎంపీలు ఇలా సాయం చేస్తే.. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు, తెరాస ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనాన్ని సీఎం సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎమ్మెల్యే, ఒక్కో ఎమ్మెల్సీకి ఏడాదికి రూ. 3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధులు వస్తాయి. వాటిని కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి అందివ్వాలని నిర్ణయించారు. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తన రెండు నెలల వేతనం రూ. 5 లక్షలను సీఎం కేసీఆర్‌కు విరాళంగా ఇచ్చారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: