ప్రపంచాన్ని వణికించేస్తున్న కొరోనా వైరస్ మహమ్మారిని పుట్టిల్లయిన చైనా ఎలా ఎదుర్కొంది ? చైనాలో కూడా ప్రధానంగా వుహాన్ ప్రావిన్స్ లో నుండి ఈ వైరస్ విజృంభుణ మొదలైంది. దాంతో ముందు జాగ్రత్తగా వుహాన్ ప్రావిన్స్ నుండి ఇతర ప్రావిన్సులకు వైరస్ సోకకుండా అక్కడి ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ముందు జాగ్రత్తల ఫలితంగా మాత్రమే వైరస్ చైనాలో నాలుగు నెలలకు అదుపులోకి వచ్చింది. చైనాలో వైరస్ అదుపులోకి వచ్చిందనే చూస్తున్నారు కాని ఎలా నియంత్రణలోకి వచ్చింది ? ముఖ్యంగా వుహాన్ లో ప్రభుత్వం అనుసరించిన మార్గాలేంటి అనే విషయాలు చాలా మందికి తెలీదు.

 

అందరి కోసమే ఈ స్టోరి ఇస్తున్నది. లాక్ డౌన్ అనేది మనకు ఇపుడు కొత్తగా అనిపిస్తున్నది. కానీ చైనా ప్రభుత్వం జనవరి 23వ తేదీనే వుహాన్ ప్రావిన్స్ లోని వుహాన్ సిటిలో లాక్ డౌన్ ప్రకటించింది. అసలే చైనా ప్రభుత్వం అందులోను లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తుందో కొత్తగా ఎవరికి చెప్పక్కర్లేదు. వుహాన్ సిటి జనాభా సుమారు 1.5 కోట్లు. చైనా ఆర్ధిక వ్యవస్ధకు వుహాన్ సిటి చాలా ముఖ్య. ప్రపంచదేశాల్లోని జనాలు కూడా చైనా అంటే ముందుగా వుహాన్ వైపే చూస్తారు.

 

చైనా ప్రభుత్వం సిటిలో ఎప్పుడైతే లాక్ డౌన్ ప్రకటించిందో వెంటనే జనాలందరినీ ఇళ్ళకే పరిమితం చేసేసింది. దాదాపు 30 రోజుల పాటు లాక్ డౌన్లో ఉన్న సిటిలో 24 గంటలూ రోడ్లపై అంబులెన్సులు, పోలీసు హారన్లు తప్ప జనాలు మరో సౌండే వినలేదంటే ఆశ్చర్యమేస్తుంది. ప్రజా రవాణా వ్యవస్ధ అయిన రైళ్ళు, బస్సులు, కార్లు, ట్రాములు అన్ని ఎక్కడవక్కడే ఫ్రీజ్ అయిపోయాయి. ఎప్పుడైతే ప్రభుత్వం హఠాత్తుగ లాక్ డౌన్ ప్రకటించిందో అప్పటి నుండే జనాలకు సమస్యలు మొదలయ్యాయి.

 

ఇళ్ళల్లో నిత్యావసరాల సమస్య మొదలైంది. రెస్టారెంట్లు, హోటళ్ళు మూసేశారు కాబట్టి తిండి సమస్య కూడా మొదలైపోయింది. పాలు, మంచినీళ్ళు, మందులు తదితరాలకు కూడా జానలను ప్రభుత్వం ఇంట్లోనుండి బయటకు రానీయలేదు. ప్రజలకు ఏదవసరమైనా సరే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్లు చేస్తే పోలీసులే తీసుకొచ్చి అందించే ఏర్పాట్లు చేసింది. రోజువారి నిత్యావసరాలను ప్రభుత్వమే అందరికీ అందించింది. సిటికి ఎక్కడెక్కడి నుండో వచ్చిన పర్యాటకుల లెక్కలను తీసుకుని వాళ్ళందరినీ ఐసొలేటెడ్ వార్డులకు చేర్చేసింది. తిండి, నిద్ర అంతా అక్కడే.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 30 రోజుల లాక్ డౌన్ కు ముందు రోజుకు 13 వేలున్న కేసులు లాక్ డౌన్ తర్వాత 600కి తగ్గిపోయాయి. ఆ తర్వాత అవి కూడా తగ్గిపోయాయి.  దటీజ్ ది పవర్ ఆఫ్ లాక్ డౌన్ అని వుహాన్ నిరూపించింది. కాబట్టే అన్నీ దేశాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: