నేరాలకు హద్దు లేకుండా పోతోంది. ఆనాటి నుండి కూడా నేరాలు ఎంతో భయంకరంగా తయారవుతున్నాయి. ప్రజలని ఇబ్బంది పెడుతూ సినిమాలో చూపించినట్టే ఈ నేరాలు బయట కూడా అనేకం జరగడం మనం చూస్తూనే ఉన్నాం. నిత్యం వార్తల్లో కూడా ఇటువంటి వార్తలని మనం వింటూనే ఉంటాం. ఇవి మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కిల్లర్లుగా మారిపోయి తోటి ప్రజలని విచక్షణ లేకుండా చంపేసిన ఘటనలు ఎన్నో .

 

అయితే ఎంతో మందిని చంపేస్తూ ఉన్న నేరగాళ్ల జాబితాలో ఉండే ఓ వ్యక్తి ఈ ఆటో శంకర్. ఇతని అసలు పేరు గౌరి శంకర్. వృత్తి ఆటో నడపడం వల్ల ఇతనిని అందరూ ఆటో శంకర్ అని పిలుస్తారు. ఇతని ఊరు కాంగేయనల్లూరు. ఇది వెల్లూరు జిల్లాలో ఉంది. అయితే మొదట శంకర్ పెరియార్ నగర్ లో పెయింటర్ గా పని చేసేవాడు.

 

 

కానీ ఆ తర్వాత ఆటో నడుపుకోవడం మొదలు పెట్టాడు. ఈ శంకర్ ని చుస్తే అంత ఎందుకు భయపడతారు? ఇతను ఒక క్రిమినల్, సీరియల్ కిల్లర్. అంతే కాక అమ్మాయిలని సప్లేయి చేసే బ్రోకర్. ఒక స్త్రీలోలుడు. ఇలా ఈ శంకర్ లో వివిధ రకాల కోణాలున్నాయి.

 

తమిళనాడు మొత్తం ఆటో శంకర్ అంటే హడల్. ఎన్నో హత్యలు కి కూడా వెనుకాడ లేదు ఈ క్రిమినల్. ఇతను ఒక గ్యాంగ్ కూడా నిర్మించుకున్నాడు. ఇలా శంకర్ అమాయకంగా కనపడుతూనే అనేక దారుణాలని చేసేవాడు. తన ఆటోలో నాటు సారని సరఫరా చేసేవాడు. అంతే కాక మహాబలిపురం నుండి మద్రాసుకి వేశ్యలని విటులకు తన ఆటో లోనే సరఫరా చేసేవాడు. అలానే కొన్ని ప్రదేశాలని వ్యభిచారానికి అడ్డా చేసాడు.

 

అడ్డు రాకుండా నాయకులని, పోలీసులని కూడా భాగస్వాముల్ని చేసాడు. ఇలా ఎన్నో చేసిన తనకి 1995 ఉరి శిక్ష పడింది. ఆ తర్వాత ఆర్కే సెల్వమణి తన జీవితం ఆధారంగా సినిమా తీశారు. తాజాగా వెబ్ సిరీస్ రంగా  తీశారు. దానిలో శంకర్ పాత్రలో శరత్ తిప్పని నటించాడు. కానీ ఇది పూర్తి బయోగ్రఫీ కాదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: