భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 13 మంది చనిపోగా... మొత్తం 600 మందికి పైగా ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. ఐతే తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అధికారులు మాట్లాడుతూ... శ్రీనగర్ నగరంలోని హైదర్‌పోరా ప్రాంతానికి చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ చెస్ట్ డిసీస్ ఆసుపత్రి లో కరోనా చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 14కి చేరుకుంది. మృతిడితో కాంటాక్ట్ లో ఉన్న నలుగురికి కూడా కరోనా ఉందని నిన్న వైద్య పరీక్షలలో తేలింది.




'మా రాష్ట్ర మొట్టమొదటి COVID-19 మరణానికి సంబంధించిన వార్తని తెలియజేసేందుకు మేము చింతిస్తున్నాం. మృతుడి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాము. మేము వారికి అండగా నిలబడి వారి బాధను పంచుకుంటాము' అని శ్రీనగర్ మేయర్ జునైద్ అజీమ్ మట్టు చెప్పాారు.

 



'చెస్ట్ డిసీస్ ఆసుపత్రిలో ధైర్యవంతులైన వైద్యులు చేసిన కృషికి నేను వారికి సెల్యూట్ చేస్తున్న. మన వంతు కృషి చేసి వ్యాధి సంక్రమణని విచ్ఛిన్నం చేసేందుకు ఇంట్లోనే ఉందాం', అని ఆయన అన్నారు.




ఇకపోతే జమ్మూకాశ్మీర్ లో మొత్తం 11 కోవిడ్ 19 కేసులు నమోదు కాగా... విదేశాల నుండి వచ్చిన 5, 124 మంది పాటు వారితో కాంటాక్ట్ లో ఉన్న వారంతా క్వారంటైన్ లో ఉన్నారు. అధికారులు చెప్పిన ప్రకారం... విదేశాల నుండి వచ్చిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని కానీ వారంతా తమ ట్రావెల్ హిస్టరీ ని బయట పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. మురగబెట్టుకుంటే కోవిడ్ 19 వ్యాధి ఇతరులకు కూడా సంక్రమిస్తుంది అని అలాగే వారి ప్రాణాలకు కూడా ప్రమాదం అని అవగాహన కల్పిస్తున్నారు అక్కడి అధికారులు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల లో లాక్ డౌన్ కొన్ని ప్రాంతాలలో తప్ప మిగతా  ప్రాంతాలలో ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో నిత్యవసర సరుకులు కొనుగోలు చేయడం కోసం ఉదయం 9లోపు వరకే అనుమతి ఉందని తెలుస్తోంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: