కరోనా రాకుండా సురక్షితంగా ఉండాలని మన భారత ప్రధాని మోదీ ఇరవై ఒక్క రోజుల పాటు లాక్ డౌన్ చెయ్యాలని ప్రకటించిన సంగతి అందరికి తెలిసినదే. ఇప్పటికే పోలీసులు అనవసరంగా బలాదూర్ చేస్తున్న వారిని చితక బాదుతున్నారు. ఇళ్ల నుండి బయటకి రాకూడదు అని చెప్పారు వస్తే లాఠీ తో బాదుతున్నట్టు కూడా తెలిసిన సంగతే.

 

 

ఈ నిబంధనల్ని ప్రతి భారతీయుడు పాటించాలి. పాటించక పోయిన, నిబంధనల్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవు అని కూడా ప్రభుత్వం ఎనౌన్స్ చేసింది. అయితే ఈ ఆదిశక్తి మాత్రం సవాలు చేసింది. నేను ఆదిశక్తిని, దేవతని అంటూ లాక్ డౌన్ నిబంధనలన్ని  ఉల్లంఘించింది.

 

ఈ ఘటన మెహ్దా పూర్వాలోని చోటు చేసుకుంది. ఆమె నివాసం వద్దనే సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడికి సుమారు వంద మంది దాకా జనం గుమికూడారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటానే అక్కడికి వచ్చేసారు. దీనితో ఎంత చెప్పిన వినలేదు. అక్కడ నుండి కదలడానికి ససేమిరా ఒప్పుకోలేదు.

 

నేను ఆది శక్తిని దమ్ము ఉంటే ఇక్కడ నుండి పంపెందుకు ప్రయత్నం చెయ్యండి అని అంది. ఇంకా వినకపోయే సరికి లాఠీ ఛార్జ్ చేసారు పోలీసులు. ఇంకా ఆ మహిళా మహిళా పొలిసు పై ఆగ్రహం వ్యక్త పరిచింది. కేసు నమోదు చేస్తానని మహిళ పొలిసు చెప్పేసరికి ఆగ్రహం తో కత్తి దూసింది. ఇంకేం ఉంది ఆమెని లాక్కెళ్లారు పోలీసులు. పొలిసు వాహనం ఎక్కించి తీసికెళ్ళి పోయారు. ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యిపోయింది. 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 
 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: