ప్రపంచ దేశాలపై మహ్మమారి కరోనా వైరస్‌ విళయతాండవం చేస్తోంది. ఆ దేశం  ఈ దేశం అన్న‌ది లేకుండా క‌రోనా అన్ని దేశాల‌ను ట‌చ్ చేస్తూ భ‌యంక‌ర విల‌యాన్ని క్రియేట్ చేస్తోంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం నాటి అప్‌డేట్ చూస్తే కరోనా పాటిజివ్‌ కేసులు 4,17,417 నమోదు అయ్యి.. ఆ సంఖ్య ఐదు లక్షల చేరువలోకి వేగంగా వేళ్తోంది. ఇక క‌రోనా సోకి మృతి చెందే వారి సంఖ్య కూడా నిమిషం నిమిషానికి పెరుగూత వ‌స్తోంది. క‌రోనా దెబ్బ‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య  21,295కి చేరి విశ్వాన్ని వణికిస్తోంది. ఇక రోజు రోజుకు కేసులు... మ‌ర‌ణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక క‌రోనా దెబ్బ‌తో ఇట‌లీ ఇప్ప‌టికే విల‌విల్లాడుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

క‌రోనా దెబ్బ‌తో ఎక్కువుగా న‌ష్ట‌పోయిన దేశం ఏదైనా ఉంటే అది ఇట‌లీ మాత్ర‌మే. ఇటీలీలో ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ చేయ‌డంలో చేతులు ఎత్తేయ‌డంతో అక్క‌డ ప‌రిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పేసింది. ఇక ఇటలీలో ప్ర‌స్తుతం రోజు రోజుకు ప‌రిస్థితులు దిగ‌జారుతున్నాయి. ఇటలీలో మొత్తం 74,386 పాజిటివ్ కేసులు, 7,503 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఇటలీ తర్వాత కరోనా అంతటి ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై చూపుతోంది. యూఎస్‌లో మొత్తం 68,421 కరోనా పాజిటివ్ కేసులు తేలగా.. 940 కిపైగా మరణాలు సంభవించాయి. ఇటలీలో మృతుల శ‌వాల‌ను గుట్ట‌లు గుట్ట‌లుగా పోగేసి గోతులు తీసి పూడ్చాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

 

ఇక యూర‌ప్ దేశాలు అయిన జ‌ర్మ‌నీ, స్పెయిన్‌, ఫ్రాన్స్ లాంటి దేశాల్లోనూ రోజు రోజుకు క‌రోనా విజృంభిస్తోంది. ఇక స్పెయిన్‌లోనూ మృతు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అక్క‌డ ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ప‌రిస్థితులు మాత్రం అదుపులోకి రావ‌డం లేదు. ఇక మ‌న దేశంలో చూస్తే క‌రోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 649కి చేరింది. మృతుల సంఖ్య 13కి చేరింది. రాష్ట్రాల వారిగా మహారాష్ట్రలో అత్యధికంగా 124 కరోనా కేసులు నమోదైయ్యాయి. అక్క‌డ ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తాయా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే ఆంధ్రప్రదేశ్‌లో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ‌లో 43కు చేరుకుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: