ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎందుకంటె ఇప్పుడు బ్యాంకు వర్కింగ్ అవర్స్ ను మార్చింది. గతంలో అంటే కరోనా రాకముందు పని సమయాలు కాకుండా ఇప్పుడు కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులలోని పని సమయాలని రోజుకు కేవలం 3 గంటలు పనిచేసేటట్లుతంలో  మాత్రమే నిర్ణయాలను తీసుకుంది. అంటే రోజు మొత్తంలో కేవలం మూడు గంటలే తెరుస్తారు. ఇప్పుడు ఈ సమయాలను మార్చడానికి గల కారణం కరోనా వైరస్. ఎందుకంటే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది కావున వారి వారి ఉద్యోగులను ప్రాణాలతో రక్షించుకునేందుకు వారి బ్యాంకు ఎంప్లాయిస్ కి ఈ సౌకర్యాన్ని కల్పించింది.

 

ఒకవేళ మీకు బ్యాంకు లో ఏదైనా పని ఉంటే మాత్రం కొత్తగా అమలు పరిచిన పని గంటల సమయాలలోనే బ్యాంకులకు వెళ్లాలని సూచిస్తున్నారు బ్యాంకు అధికారులు. స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా ఈ విషయమై మాట్లాడారు. మేము ఈ నిర్ణయం తీసుకోవటం వలన సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని కానీ మా బ్యాంకు అధికారులను రక్షించుకునేందుకు ఇలా చేయటం తప్పట్లేదని అయన పేర్కొన్నారు.

 

అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి తోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. మార్పు చేసిన పని గంటల్లో భాగంగా కొన్ని బ్యాంకులు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు పని చేస్తున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు తెరుస్తున్నారని. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తున్నాయని తెలిపారు. అయితే.. ఇప్పుడు విధులకు ఎవరైతే హాజరైతారో వారికి ఎస్‌బీఐ బ్యాంకు మాస్క్‌ లు, శానిటైజర్లను అందిస్తోంది.

 

బ్యాంకులలో క్యూ లైన్లలో నిలుచున్న వ్యక్తుల మధ్య కనీసం 1 మీటర్ దూరాన్ని పాటిస్తున్నారు. ఎస్‌బీఐ బ్యాంక్ మొబైల్ ఏటీఎం సర్వీసులను కూడా అందిస్తోంది. ఈ అవకాశంతో పాటు కస్టమర్లు సులభంగానే ఏటీఎం నుంచి డబ్బులు విత్‌ డ్రా చేసుకోవచ్చు. అలాగే డబ్బులు డ్రా చేసే ముందు కొన్ని టిప్స్ పాటించాలని కస్టమర్లకు సూచనలు చేసింది. ఇంకా ఇలా ఎస్‌బీఐ బ్యాంకు మాత్రమే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటివి కూడా బ్యాంక్ టైమింగ్స్‌ ను మార్చేశాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. ఎవరైనా అవసరమైతే తప్ప బ్యాంకులకు రావాలని లేకపోతే బ్యాంకులకు రాకూడదని కస్టమర్లను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: