దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. భారత్ లో ఇప్పటివరకూ 649 మంది కరోనా భారీన పడ్డారు. వీరిలో 13 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. ఏపీలో నిన్నటివరకూ 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హిందూపురంలో కరోనా అనుమానిత కేసు వెలుగుచూసింది. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి దుబాయ్ నుంచి పట్టణంలో సీపీఐ కాలనీకి వచ్చాడు. 
 
గత మూడు రోజుల నుంచి ఆ వ్యక్తి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఇతర సమస్యలతో బాధ పడుతున్నాడు. అతనికి కరోనా సోకిందనే అనుమానంతో వైద్యులకు సమాచారం అందించగా అతన్ని హిందూపురంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతని నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు తెలుస్తోంది. ల్యాబ్ నుండి డాక్టర్లకు ఇతని రిపోర్టులు అందాల్సి ఉంది. అతని భార్య కూడా గత రెండు రోజుల నుంచి తీవ్రమైన ఒళ్లునొప్పులతో బాధ పడుతోంది. 
 
వైద్యులు అతన్ని, అతని భార్యను అనంతపురం పెద్దాసుపత్రికి తరలించారు. వీరు బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది బంధువులను కలిసినట్లు వైద్యులకు చెప్పారు. వైద్యులు, అధికారులు వీరి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. ఈ వ్యక్తి గోరంట్ల, అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో కూడా సంచరించాడని సమాచారం. పట్టణంలో కరోనా అనుమానిత కేసు వెలుగు చూడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి మీడియాతో మాట్లాడనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే జనాలు, రాష్ట్రంలో వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర విషయాల గురించి జగన్ మాట్లాడనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ, నగదు పంపిణీ, వాలంటీర్ వ్యవస్థ పనితీరు గురించి కూడా జగన్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: