ఈ పుడమి పై ప్రాణి మనుగడతో పాటుగా పంచభుతాలు ఏర్పడ్డాయి.. అయితే ఇవన్ని కూడా ఒకదానికి ఒకటి అనుసంధానంగా జీవిస్తున్నాయి..ఇలాంటి పరిస్దితుల్లో మనిషిలోకి మాయ అనే రాక్షసుడు ప్రవేశించగానే.. ఆశతో తన జీవన విధానాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడం మొదలు పెట్టాడు.. అలా అలా పచ్చగా బ్రతక వలసిన ప్రకృతిని నాశనం చేస్తూ తాను మాత్రం సుఖంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.. ఇక ప్రకృతి వల్ల మనిషికి నష్టం కలగలేదు.. కానీ మనిషి వల్ల ప్రకృతి పూర్తిగా నష్టపోయింది.. ఈ దశలో సృష్టి మొదలు పంచభూతాలు ఎలా ఉన్నాయో అవి వాటి స్వరూపాన్ని కోల్పోకుండా ఇప్పటికి అలాగే ఉన్నాయి..

 

 

కానీ మనిషిలో మాత్రం ఊహించనంత మార్పు, లెక్కకట్ట లేనంతగా స్వార్ధం నిండిపోయింది.. దాని ఫలితమే క్రమక్రమంగా అనుభవిస్తున్నాడు.. ఆ అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలి కాని మితిమీరిన తెలివి తేటలతో, ఈ తరాలతో పాటుగా భవిష్యత్తు తరాల జీవితాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టాడు.. అందువల్ల దీని ఫలితాలు విపత్తులా మారి ప్రపంచాన్ని కబళిస్తున్నాయి.. అవి కొత్త కొత్త రోగాల రూపంలో మానవాళిని అంతం చేయడానికి వస్తున్నాయి..  

 

 

ఇకపోతే ఒక మనిషికి కలిగిన చెడు ఆలోచనవల్ల ప్రపంచాన్ని ఎలా నాశనం చేయవచ్చో చైనా నిరూపించింది.. ఇంత కాలం తక్కువ ధరకు వస్తున్నాయని అందరు గ్యారంటీ లేకున్నా ఎగబడి మరీ చైనా వస్తువులు కొన్నారు.. ఆ దేశాన్ని ఆర్ధికంగా ముందు నిలబెట్టారు.. కానీ నీతిలేని చైనా కరోనాను సృష్టించింది.. ఇకపోతే ఈ కరోనాకు ఫుల్ గ్యారంటీ ఉన్నట్లుగా ఉంది.. అందుకే ఎంతకు చావడం లేదు.. చంపడమే తెలిసిన కరోనా మొండిగా తన యాత్రను సాగిస్తుంది.. అయితే బయోవార్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుంటే.. క్రీస్తుపూర్వం ఆరో దశాబ్దం నుంచే బయోవార్‌లు జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

 

 

అప్పుడు వైరస్‌పై అంత అవగాహన లేకపోవడం వల్ల ఫంగస్‌ను మాత్రమే ఆయుధంగా ఉపయోగించారు. ఇక 1346 లో మంగోలు గెరిల్లాలు ప్లేగు వ్యాధిని ఆయుధంగా వాడుకున్నారు. యూరప్‌ లో ప్లేగు వ్యాధి విస్తరణకు వారే కారణమనే ఆరోపణలున్నాయి. ఇదేగాక 1789 లో సౌత్ వేల్స్‌పై బ్రిటన్ స్మాల్‌పాక్స్‌ను వాడింది. ఇక వైరస్‌ను ఆయుధంగా ఉపయోగించడం 1900 సంవత్సరం లో ప్రారంభమైంది. ఆ తర్వాత రెండో ప్రపంచయుధ్ధం సందర్భంగా జర్మనీ కొన్ని దేశాలపై బయోవార్‌తో భయానక వాతావరణాన్ని సృష్టించింది.. ఇలా ప్రారంభమైన బయోవార్‌ను ఇప్పుడున్న దశలో చైనా విజయవంతంగా ముందుకు నడిపిస్తుంది.. దీనిఫలితమే ఇప్పుడు వచ్చిన కరోనా..

మరింత సమాచారం తెలుసుకోండి: