మోదీ నిజంగానే గొప్పోడ్రా బాబు !

యుద్ధం వస్తే కానీ రాజు గొప్పదనం ఏంటో తెలియదు అన్నట్టుగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్పదనం ఏంటో అందరికి బాగా తెలిసొచ్చింది. నిజంగా మోదీ ఎంత గొప్పోడా అంటూ ప్రజలంతా ఇప్పుడు మోదీ నిర్ణయాలను సమర్దిస్తుండడమే కాకుండా అయన గొప్పదనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అవును నిజమే మరి 130 కోట్ల మంది భారతీయులను ఏకతాటిపైకి తీసుకురావడం అంటే మాటలా ..? కానీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని మన దేశంలో విజృంభించకుండా చేయడంతో పాటు ప్రజలు కరోనా భారిన పడకుండా మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆన్చే కాదు ముందు ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఆయన వెనకాడడంలేదు.  

 

IHG

ఇప్పటికే చాలా దేశాలు కరోనా కారణంగా అతలాకుతలం అయ్యాయి. ఆ పరిస్థితి భారత దేశానికీ రాకుండా చేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నాడు. జనతా కర్ఫ్యూ పేరుతో  అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. జనతా కర్ఫ్యూ రోజున దేశమంతా ఎక్కడికక్కడ స్థంభించిపోవడం చూసి ప్రపంచమంతా భారత దేశం క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు 21 రోజల లాక్ డౌన్ నిర్ణయం కూడా  అటువంటిదే దేశంలో కరోనా విస్తరిస్తోందని గ్రహించిన కేంద్రం ముందు జనాలు గుంపులు చేరే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కరోనా విస్తరించడానికి వీల్లేకుండా మార్చి 22న జనతా కర్ఫ్యూ నిర్వహిద్దామంటూ దేశప్రజలందరి సహకారం తీసుకున్నారు మోదీ. 

IHG


ఆయన ఇచ్చిన పిలుపుతో యావత్ భారతం ఇళ్లల్లోంచి బయటికి రాలేదు. ఒక్క రోజు కర్ఫ్యూ సక్సెస్ కావడంతో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను, 75 జిల్లాలను లాక్ డౌన్ చేస్తున్నట్టు అత్యవసరంగా ప్రకటించారు మోదీ.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడం, మోదీ నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించకుండా జనాల నుంచి సహకారం లభించడంతో ఏకంగా దేశమంతా మూడు వారాల పాటు లాక్ డౌన్ చేస్తున్నామంటూ మోదీ పిడుగులాంటి వార్తను చెప్పారు. మోదీ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు సరికదా ప్రతి ఒక్కరూ మన మంచికే కదా చెబుతోంది అంటూ అర్ధం చేసుకున్నారు. మోదీ ప్రసంగం ఆ విధంగా ఉంది. తన ప్రసంగంలో ప్రజలకు అర్ధం అయ్యే విధింగా చెప్పిన తీరుపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

 

అసలు లాక్ డౌన్ అంటూ సవిరంగా చెప్పకుండా నిర్బంధంగా దీనిని అమలు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ మోదీ మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పిన తీరు ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తోంది. అసలు ప్రధాన మంత్రి స్థానంలో మోదీ కాకుండా వేరే ఎవరైనా ఉండిఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో తలుచుకునేందుకే ప్రజలు భయపడిపోతున్నారు. అంటే మోదీ ఎంత సమర్ధుడో అన్న విషయం ఈ విపత్కర సమయంలో మరోసారి బయటపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: