చెప్పడం కాదు.. చేసి చూపించాలని అంటారు.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎలా తరిమి కొట్టాలో తలలు పట్టుకుంటున్నారు.  చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ కి ఇప్పటి వరకు మందులేదు.  అయితే దీన్ని తగ్గించే ప్రయత్నంలో 1.3 బిలియన్ల జనాభా ఉన్న భారత దేశం మెుత్తం మార్చి 24, 2020 నుంచి  ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది.  కరోనాను అరికట్టేందుకు భారత్ లో లాక్ డౌన్ చేశారు.. కానీ రోజు దినసరి కూలీల పరిస్థితి ఏంటేన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. దాంతో సెలబ్రెటీలు తమకు తోచిన సహాయాన్ని పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళంగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ నటులు తమ విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళంగా ఇస్తున్నారు. సినీ ఇండస్ట్రీ ఇప్పటికే ముందుకు కదిలింది. 

 

 ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ క్రికెటర్  బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల రైస్ ని విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బియ్యంతో పాటు, భద్రత కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటున్న నిరుపేదలకు  కూడా సదుపాయం కల్పిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఒక ప్రకటనలో తెలిపింది.  బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన పనితో రాష్ట్రంలోని ఇతర పౌరులకు ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయమని ప్రోత్సాహిస్తుందని ఆశిస్తున్నాం అని సంస్ధ తెలిపింది.

 

ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది... ఇందుకోసం సంపన్నులు ముందుకు రావాలని.. మొన్న జనతా కర్ఫ్యూని ఎలా సంఘటితంగా నిలిచారో.. ఇప్పుడు పేద ప్రజలను ఆదుకునేందుకు ముందుకా రావాలని పలువురు నేతలు, సెలబ్రెటీలు కోరుతున్నారు.  భారతదేశంలో రోజు రోజు కేసులు సంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతం 664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 14 మంది మరణించారు. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: