కరోనాతో దేశం అతలాకుతలం అయిపోతోంది. ఇంకేం ఉంది జనం బయటకి కాలు కూడా పెట్టలేని దుస్థితి. వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక జనం అల్లాడి పోతున్నారు. ఏం చెయ్యాలిరా భగవంతుడా ఈ దుస్థితి ఏమిటి అని కన్నీరు పెట్టుకునే అంత దారుణం. అయితే ప్రజలకి మోదీ ప్రభుత్వం మంచి శుభవార్తే అందించింది.

 

 

ప్రభుత్వం ఆదుకుంటూ కొన్ని ఇప్పుడే చెప్పుకొచ్చింది. నిర్మాణ రంగం లో పని చేసే కార్మికులకు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు కూడా చెప్పారు. ఇది మాత్రమే కాక లాక్ డౌన్ వల్ల వచ్చే నష్టానికి ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస జీవులకి  అలానే పని లేదు కనుక ఇబ్బంది పడే కూలీలకు ఆకలితో ఉంటారని ఉద్దేశం తో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.7 లక్షల కోట్లని ప్రకటించారు.

 

 

ఇది ఇలా ఉండగా కరోనాతో అతలాకుతలం అవుతున్న జనానికి సేవ చేస్తున్న డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఆశ వర్కర్స్, శానిటైజేషన్ వర్కర్స్ కోసం రూ.50 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ అందించనున్నారని తెలిపారు. 

 

 

80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. అలానే  8 కోట్ల పేదలకి మూడు నెలలు ఉచిత సిలెండర్ అందించబోతున్నారట. అలానే రైతులకి మొదటి వాయిదా కింద 2  వేలు వారి ఖాతాలో వేయనున్నట్టు కూడా తెలిపారు.  

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: