కరోనా కలవరం ఇప్పుడు దేశంలో  హాట్ టాపిక్ అయిపొయింది. ఈ  కరోనా నేపథ్యంలో  మన  ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం  విద్యార్థులను ఉద్దేశించి  మరో కీలక నిర్ణయం తీసుకుంది.  అయితే  6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది.  మాములుగా అయితే  6 నుంచి 9 వ తరగతి విద్యార్థులు కూడా  సంవత్సర పరీక్షలు రాసి పై తరగతి కి ప్రమోట్ అయ్యి వెళ్లేవారు.

 

కానీ ఇప్పుడు అందుకు  భిన్నంగా  కరోనా   దృష్ట్యా  ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే మన  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం ఎవ్వరికి  మంచిది  కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా మంచిది కాదని మంత్రి తెలిపారు.

 

అలాగే పదో తరగతి పరీక్షలను ఇప్పటికే వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈనెల 31న జరిగే సమీక్ష తరువాత పదోతరగతి పరీక్షలు షెడ్యూల్‌ను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. దీనిపై విద్యార్థులు ఎలాంటి భయానికి  గురికావద్దని సూచించారు. .కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం  మధ్యాహ్న భోజనానికి బ్రేక్‌ పడనీయలేదు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం ఇళ్లకే చేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో విద్యాశాఖ అమలు చేస్తోంది.

 

ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. పాఠశాల విద్యార్థుల ఇళ్లకు వెళ్లి నేరుగా తల్లిదండ్రులకు బియ్యం, గుడ్లు, చెక్కీలు పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో చేపట్టింది. ఈ బాధ్యతను ఆయా పాఠశాల పరిధిలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు, వలంటీర్లకు అప్పగించింది.

 

 విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. భోజన పంపిణీ సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అలాగే ఆహారం విషయం లో క్వాలిటీ మైంటైన్ చేయాలనీ చెప్పారు. ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోకండి, ఇంటి వద్దకే భోజనం వస్తుందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: