కరోనాపై పోరాటంలో కేంద్రం అద్భుతమైన చర్యలు తీసుకుంటోంది. కష్టకాలంలో నాయకుడు అనేవాడు ఎంత కీలకమో ప్రధాని మోడీ మరోసారి చాటి చెప్పారు. కరోనా వైరస్ భారత్ ను కబళించే అవకాశం ఉన్న సమయంలో ఆయన ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. దేశాన్ని ఏకం చేస్తూ కరోనాపై పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మొన్నటికి మొన్న జనతా కర్ఫ్యూ పేరిట మోడీ ఇచ్చిన పిలుపునకు అద్భుతంగా ఫలితం వచ్చిన సంగతి తెలిసిందే.

 

 

ఆ తర్వాత కూడా కరోనాపై పోరాటాన్ని మోడీ పక్కా పథకంతో నడిపిస్తున్నారు. ఇది ఒక రోజుతోనో.. ఒక వారంతోనో.. ఒక నెలతోనే ఆగే యుద్ధం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఏకంగా మూడు నెలల పాటు దేశాన్ని సన్నద్ధం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రజలకు కల్పించేందుకు నిర్ణయించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ అన్ని వర్గాలకూ ఉపశమనం కలిగించిది.

 

 

వాస్తవానికి ఈ లాక్ డౌన్ ద్వారా అధికంగా ఇబ్బంది పడేది పేదలే. కాస్తో కూస్తో ఆదాయం ఉన్నారు దీన్నో లాంగ్ హాలీడే గా భావిస్తున్నారు. ఇక ధనవంతుల సంగతి చెప్పక్కర్లేదు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు ఈ లాకౌట్ తో అల్లాడిపోతున్నారు. అందుకే వారికి అండగా నిలిచేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అదనంగా బియ్యం ఇచ్చేందుకు సిద్ధపడింది. మూడు నెలల రేషన్ ముందుగానే ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

 

 

ఇక ఆ తరవాత ఎక్కువగా ప్రభావితం అయ్యే రైతులపైనా మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏకంగా నెలకు రూ. 2000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో డబ్బు వేసేందుకు నిర్ణయించింది. అలాగే మహిళలకు రూ. 500 చొప్పున 3 నెలలపాటు వారి ఖాతాల్లో వేయాలని నిర్ణయించింది. ఇలా దేశాన్ని ఓ దీర్ఘకాల యుద్ధానికి సిద్ధం చేసిన మోడీని శభాష్ అని అభినందించకుండా ఉండలేం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: