క‌రోనా దెబ్బ‌తో అన్ని రంగాలు మంద‌గించాయి. చివ‌ర‌కు చాలా మందికి తిన‌డానికి తిండి కూడా దోర‌క‌డం లేదు. బ‌య‌ట ప‌హారా కాస్తోన్న పోలీసుల‌కు సైతం తిండి లేక‌పోవ‌డంతో వాళ్లంతా విల‌విల్లాడుతున్నారు. ఇక ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ దేశం అంతా అమ‌ల్లో ఉండడంతో నిత్యావ‌స‌రాలు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. మ‌రో వైపు బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. ఇక మందు బాబుల బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. అస‌లు సాయంత్రం అయితే చాలు మందు నోట్లోకి దిగందే వాళ్ల మ‌న‌స్సు ఆగ‌దు. ఇప్పుడు క‌రోనా దెబ్బ‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో మద్యం దొరక్క విల‌విల్లాడుతున్నారు.

 

ఇక ఇప్పుడు త‌మ ఎదురుగా బీరు బాటిల్స్‌తో వెళుతోన్న లారీ క‌న‌ప‌డ‌డంతో వీళ్లంతా క‌లిసి చేతులకు ప‌ని చెప్పారు. ఆ లారీనీ ఏకంగా లూఠీ చేసి బీర్లు దొంగిలించేశారు. ఏకంగా 120 కేసుల బీర్లు చోరీ చేశారు. ఈ సంఘ‌ట‌న ఎక్క‌డో జ‌ర‌గ‌లేదు... మ‌న తెలంగాణ‌లోనే జ‌రిగింది. తెలంగాణ లోని మేడ్చల్ జి్లా పరిధిలోని దేవరయాంజల్ వద్ద జ‌రిగింది. అక్క‌డ ఉన్న ప్ర‌భుత్వ మ‌ద్యం డిపోకు మ‌ల్లేప‌ల్లి నుంచి బీర్ల‌తో లారీ వ‌చ్చింది. అయితే క‌రోనా లాక్ డౌన్ న‌డుస్తుండ‌డంతో బీర్ల‌ను లారీ నుంచి కింద‌కు దించ‌లేదు. దీంతో రాత్రి వేళ దండుగులు రెచ్చిపోయారు.

 

లారీలోకి చొర‌బ‌డ్డారు.. వెంట‌నే బీర్ కేసులు దొంగిలించేశారు. ఎవ‌రికి దొరికిన కేసుల‌ను వారు దొంగిలించుకు పోయారు. ఏకంగా 120 బీర్ కేసులు చోరీ చేశారు. ఉదయాన్నే వచ్చి చూసిన లారీ డ్రైవర్ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. చివ‌ర‌కు వాళ్లు చేసేందేం లేక పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. బీర్లు ఎత్తుకెల్లింది ఎవ‌రా ? అని ఆరాలు తీస్తోన్న పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వైన్స్, బార్లు మూసివేయడంతో ఇంటి దొంగలే చోరీకి పాల్పడి ఉంటారన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: