మీడియా.. ప్రభుత్వాలకూ ప్రజలకూ మధ్య వారధి లాంటిది.. సమాజాని వ్యక్తికీ మీడియా ఓ వారధి.. ఇంట్లో ఉన్న వ్యక్తి మీడియా అనే కిటికీ తెరిస్తే.. ప్రపంచమే అతని ముందు వాలిపోతుంది. విశ్వంలో ఏ మూల ఏం జరిగినా దాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా ఆసక్తిగొలిపేలా చెబుతుంది. మరి అలాంటి మీడియాకు కూడా ఇప్పుడు కరోనా రూపంలో కష్టకాలం వచ్చింది. కరోనా భయంతో మిగిలిన అన్ని రంగాల వారు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా ఉంటే.. అత్యవసర సర్వీసుల వారు మాత్రం కరోనాపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

 

అలాంటి వారిలో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల, మీడియా కీలకమైనవి. సామాన్యుడికి మీడియా అంతా ఒకలానే కనిపించినా.. ఇందులో ఎన్నో విభాగాలు.. డెస్కు జర్నలిస్టులు, ఫీల్డు జర్నలిస్టులు అని ప్రధానంగా రెండు రకాలు. ఇలాంటి విపత్కర సమయాల్లో డెస్కు జర్నలిస్టులు కాస్త ఊపిరిపీల్చుకున్నా.. ఫీల్డ్ జర్నలిస్టులు అంటే రిపోర్టర్ల పరిస్థితి నిజంగా కత్తి మీద సామే.

 

 

ఓవైపు భయంకరంగా విస్తరిస్తున్న కరోనా వైరస్. కానీ జనంలోకి వెళ్లక తప్పదు. జనం కష్టాలు, జనం బాధలు, జనం అభిప్రాయాలకు అద్దం పట్టక తప్పదు. ఆ జనంలో ఎవడికి కరోనా ఉందో ఎవరికి తెలుసు. కానీ రిపోర్టరన్న ప్రాణాలకు తెగించి రంగంలో దిగాల్సిందే. కరోనా పై యుద్ధం చేస్తున్న వైద్యులను ఇంటర్వ్యూలు చేయాలి. బాధితులను ఇంటర్వ్యూలు చేయాలి.. సామాన్యులను ఇంటర్వ్యూ చేయాలి.

 

 

ఈ క్రమంలో వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అవేమీ ప్రమాదం నుంచి కాపాడే స్థాయివి కావు. కానీ తప్పదు. అదే కదా జర్నలిజం అంటే.. అదే కదా ఇతర వృత్తులకు భిన్నంగా జర్నలిజాన్ని నిలబెడుతున్నది. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా.. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో జనం కోసం సమాజాన్ని అద్దంలా మీ ముందుకు చూపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పాత్రికేయులకూ హ్యాట్సాఫ్ అని చెప్పకతప్పదు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: