కరోనా మహమ్మారిపై భారత్ యుద్ధం తీవ్రతరం చేసింది. ఏకంగా మూడు నెలల పాటు పోరాటానికి సైతం రెడీ అంటూ ప్రధాని మోడీ సంకేతాలు పంపేశారు. ఈ మేరకు అంతా సిద్ధం చేశారు. మరోవైపు ఇదే సమయంలో పొరుగున ఉన్న చైనా ఇండియా కరోనా వార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా చైనా అంటే ఇండియాకు శత్రువుగా ఫీలవుతుంటారు. కానీ ఈసారి మాత్రం చైనా ఇండియాపై ప్రశంసల వర్షం కురిపించింది.

 

 

ఇండియాలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ తప్పక విజయం సాధిస్తుందని చైనా ఆకాంక్షించింది. అంతే కాదు.. ఇలాంటి అత్యవసర సమయంలో భారత్‌కు సాయం చేయడానికి తాము రెడీ అంటూ స్నేహ హస్తం చాచింది. కొన్ని రోజుల క్రితం కరోనాపై యుద్ధం లో చైనాకు భారత్ చేసిన సాయాన్ని ఆ దేశం గుర్తు చేసుకుంది. కరోనాపై చైనా చేసిన పోరాటానికి మద్దతు తెలిపిన భారత ప్రజలకు థ్యాంక్స్ చెప్పింది.

 

 

అందుకే కరోనాపై పోరులో భారత్ కు ఎలాంటి సాయమైనా అందించేందుకు సిద్ధమని చైనా ప్రకటించింది. ఇండియాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో చైనా రాయబారి జీ రింగ్‌ ఢిల్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. కరోనా పోరులో చైనా అవలంభించిన విధానాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను భారత్‌తో పంచుకున్నట్లు తెలిపారు.

 

 

కేవలం మాటలతో సరి పెట్టకుండా భారత్‌కు సాయం చేసేందుకు చైనా సంస్థలు నిధులు పోగుచేస్తున్నాయి. కరోనా చైనాను ముప్పుతిప్పలు పెడుతున్న సమయంలో భారత్ మాస్కులు, గ్లౌజులతోపాటు 15టన్నుల అత్యవసర వైద్య పరికరాలను అందించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: