శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పబడుతున్న శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం తిరుమల కొండలలో కొలువైవున్న  సంగతి అందరికి విదితమే. కలియుగ మానవులను, కష్ట నష్టాలనుండి.. రక్షించడానికి స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉన్నట్లు భక్తుల విశ్వాసం. అందువల్ల ఈ ప్రదేశాన్ని.. కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక తిరుమల కొండలు దట్టమైన వృక్షాలతో.. మొక్కలతో.. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ఏటా.. లక్షల సంఖ్యలో పర్యాటకులు తిరుమల కొండల అందాలను తిలకించడానికి వస్తూ వుంటారు.

 

IHG

 

అయితే, ఇపుడు అవే కొండలు.. ప్రమాదపు అంచులో ఉన్నట్లు తెలుస్తోంది.. తిరుమలకు సమీపంలో గల మంగళం అటవీ ప్రాంతంలో మంటలు భారీగా చెలరేగడంతో, దట్టమైన పొగలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. బలంగా వీస్తున్న ఈదురు గాలులకు మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. దాంతో మంటలు మెల్లి మెల్లిగా సమీపాన వున్న తిరుమల కొండలకు ఎగబాకుతున్నాయి.

 

ఈ భారీ దహన కాండకు సమీపంలో వున్న ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న వేళ, పుణ్యక్షేత్రంగా పిలవబడుతున్న తిరుమలలో జరుగుతున్న ఈ దహనకాండను చెడుకి చిహ్నంగా భావిస్తున్నారు స్థానికులు. ఇంకా మున్ముందు ఎన్ని ఘోరాలను చూడాల్సి వస్తుందోనని తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనౌతున్నారు.

 

IHG

 

తిరుమల శ్రీవారి భక్తులు, ఆయనను దర్శనం చేసుకోవడానికి ప్రతియేటా పెద్ద ఎత్తున వెళుతూ వుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో... కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి. ప్రస్తుతం తిరుమల నిర్మాణుష్యంగానే వుంది. ఇది ఓ రకంగా మంచిదే అయింది. ఎందుకంటే... సమీప ప్రాంతం దగ్ధమౌతున్న నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు వచ్చేవని ఈ సందర్భంగా  స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే శ్రీవారు భక్తులు...శ్రీవారి కొండలకు ఎలాంటి హాని కలగకూడదని మొక్కుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: